Site icon NTV Telugu

YS Jagan: అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై జగన్‌ కీలక నిర్ణయం..

Ys Jagan

Ys Jagan

YS Jagan: ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకాబోతున్నాయి.. తొలిరోజు ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించనున్నారు.. ఆ తర్వాత జరిగే బీఏసీ సమావేశంలో సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు.. ఇక, ఈ నెల 28వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం.. అయితే, ఈసారి అయినా.. అసెంబ్లీ సమావేశాలకు వైఎస్‌ జగన్‌, వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారా? లేదా? అనే చర్చ సాగుతోన్న సమయంలో.. సమావేశాలకు హాజరవ్వడంపై కీలక నిర్ణయం తీసుకున్నారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు.. అంతేకాదు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైసీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.. ఇక, ఎల్లుండి ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కాబోతున్నారు వైఎస్‌ జగన్.. శాసన సభ, మండలిలో వ్యవహరించాల్సిన తీరుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేయనున్నారు.. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని టార్గెట్‌తో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది..

Exit mobile version