YS Jagan: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య రాజకీయ విమర్శల పర్వం ఆగడం లేదు.. ఈ వివాదంపై స్పందించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ లిఫ్ట్ స్కీం కొత్త ప్రాజెక్టు కాదని, దీనివల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు. ఈ అంశంపై వాస్తవాలను పక్కనపెట్టి రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు మౌనంగా ఉంటున్నారని, కాంగ్రెస్‌తో రాజకీయ స్నేహం కోసమే స్పందించడం లేదని విమర్శించారు.
కొత్త ప్రాజెక్టు కాదు.. అదనపు నీటి కేటాయింపులు లేవు!
తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ స్కీం కొత్త ప్రాజెక్టు కాదని వైఎస్ జగన్ వివరించారు. ఈ పథకం ద్వారా అదనపు నీటి కేటాయింపులు, కొత్త కాల్వలు, అదనపు రిజర్వాయర్లు లేదా కొత్త ఆయకట్టు ఏర్పడవని పేర్కొన్నారు. కృష్ణానది నుంచి ఇప్పటికే కేటాయించిన నీటినే సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఈ పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఉన్న కాల్వల ద్వారానే రాయలసీమలోని ప్రాజెక్టులకు నీటిని తరలించేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. తరచూ కరువు పరిస్థితులను ఎదుర్కొనే రాయలసీమకు ఈ పథకం ఒక ఇన్సూరెన్స్ లాంటిదని అభివర్ణించారు.
తగ్గుతున్న కృష్ణా జలాలు.. రాయలసీమకు ఇబ్బందులు
గత కొన్ని దశాబ్దాలుగా కృష్ణానది ద్వారా రాష్ట్రానికి వచ్చే నీటి పరిమాణం తగ్గిపోతోందని పేర్కొన్నారు జగన్.. ఎగువ నుంచి నీళ్లు రాకపోవడం ఒక సమస్య అయితే, వచ్చిన నీటిని కూడా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో దిగువకు విడుదల చేయడం మరో సమస్యగా మారిందన్నారు. ఈ పరిస్థితుల కారణంగా రాయలసీమలో తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చడం కష్టంగా మారుతోందని వివరించారు.
880 అడుగుల నీటిమట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా నీరు
శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా పూర్తిస్థాయిలో 44 వేల క్యూసెక్కుల నీటిని తరలించాలంటే రిజర్వాయర్‌లో నీటిమట్టం కనీసం 880 అడుగులు ఉండాలని జగన్ వివరించారు. నీటిమట్టం 854 అడుగుల కంటే దిగువకు పడిపోతే నీటిని పంపడం సాధ్యం కాదని తెలిపారు. శ్రీశైలంలో 880 అడుగులకు పైగా నీటిమట్టం ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. దీంతో రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రాజెక్టులతో రోజుకు 3 టీఎంసీల తరలింపు సామర్థ్యం
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని వినియోగించుకునేలా పలు ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తోందని ఆరోపించారు వైసీపీ అధినేత.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా రోజుకు 1.5 టీఎంసీలు, డిండి ద్వారా 0.5 టీఎంసీలు, కల్వకుర్తి ద్వారా 0.4 టీఎంసీలు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 0.5 టీఎంసీల నీటిని తరలించే సామర్థ్యంతో పనులు జరుగుతున్నాయని వివరించారు. మొత్తంగా రోజుకు దాదాపు 3 టీఎంసీల నీటిని తరలించే సామర్థ్యం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. దీనికి తోడు 800 అడుగుల నుంచే విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే తమ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ స్కీంను చేపట్టిందని తెలిపారు. శ్రీశైలంలో నీటిమట్టం తగ్గి పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకోలేని సమయంలో, లిఫ్ట్ విధానంలో నీటిని ఎత్తిపోసి తిరిగి పోతిరెడ్డిపాడు కాల్వల్లోకి పంపించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని వివరించారు. అక్కడి నుంచి ఇప్పటికే ఉన్న కాల్వల ద్వారా పాత రిజర్వాయర్లకు నీటిని చేరవేయాలని ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. నీటి కేటాయింపులు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకునే అవకాశం లేకపోతే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు.
దాదాపు పూర్తయిన పనులు నిలిపివేత..!
రాయలసీమ లిఫ్ట్ స్కీం పనులు దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్న సమయంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని జగన్ పేర్కొన్నారు. అయితే, అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పనులను నిలిపివేశారని విమర్శించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే జగన్‌కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే పనులు ఆపేశారని ఆరోపించారు. ప్రాజెక్టు ఆవశ్యకతను వివరించి అభ్యంతరాలను పరిష్కరించాల్సింది పోయి, రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమ ప్రజల ప్రయోజనాలను పక్కనపెట్టారని మండిపడ్డారు. రాయలసీమ ప్రజలు తరచూ కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో, వారికి కేటాయించిన నీటిని కూడా వినియోగించుకునే అవకాశాన్ని దెబ్బతీయడం అన్యాయమని జగన్ విమర్శించారు. అదనపు నీటి కేటాయింపులు, కొత్త రిజర్వాయర్లు, కొత్త ఆయకట్టు లేని ఈ పథకంపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజల తాగునీటి, సాగునీటి అవసరాలను తీర్చే ఇన్సూరెన్స్ లాంటి రాయలసీమ లిఫ్ట్ స్కీంను రాజకీయ వివాదంగా మార్చకుండా, దాని ఆవశ్యకతను గుర్తించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి..
రాయలసీమ లిఫ్ట్ స్కీంపై, తెలంగాణలో పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం వాస్తవాలను మరుగున పరుస్తోంది. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన @ncbn తన హాట్‌లైన్ కాంగ్రెస్‌తో దోస్తీ రాజకీయాలకోసం మౌనంగా ఉన్నాడు.
మా ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ స్కీం కొత్త ప్రాజెక్టు కాదు! దీనికి అదనపు నీటి కేటాయింపులు లేవు, కొత్త కాల్వలు లేవు, అదనపు రిజర్వాయర్లు లేవు, అదనపు ఆయకట్టూ లేదు! అదే కృష్ణానది, అవే నీళ్లు, అవే కేటాయింపులు, అదే పోతిరెడ్డిపాడు నుంచి అవే కాల్వల ద్వారా దుర్భిక్ష పరిస్థితులను తరచుగా ఎదుర్కొనే, అవే రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన, అవే జలాలనే సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన ఒక ఇన్సూరెన్స్ స్కీం లాంటిదే ఈ పథకం.
కొన్ని దశాబ్దాలుగా కృష్ణానది ద్వారా రాష్ట్రానికి వచ్చే నీళ్లు తగ్గిపోతున్న నేపథ్యంలో, పైనుంచి నీళ్లు రాకపోవడం ఒక సమస్య అయితే, వచ్చిన ఆ నీటిని కూడా తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి పేరుతో ఇష్టానుసారంగా దిగువకు వదిలేయడం మరొక తీవ్రమైన సమస్య.
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా, శ్రీశైలం నుంచి పూర్తిస్థాయిలో, అంటే 44వేల క్యూసెక్కుల నీళ్లు పారాలంటే శ్రీశైలంలో నీటిమట్టం కనీసం 880 అడుగులపైన ఉండాలి. ఆ నీటి మట్టం 854 అడుగుల దిగువకు పడిపోతే అసలు నీళ్లే పంపలేం. ఆ 880 అడుగులపైన రిజర్వాయర్ లెవల్ ఎన్నిరోజులు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. దీనివల్ల రాయలసీమ తాగునీటి, సాగునీటి అవసరాలు తీరడం అసాధ్యంగా మారుతూ వస్తోంది.
మరోవైపు తెలంగాణ రాష్ట్రం శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని తీసుకునేందుకు, పాలమూరు-రంగారెడ్డి ద్వారా రోజుకు 1.5 టీఎంసీలు, డిండి ద్వారా 0.5 రోజుకు టీఎంసీ, కల్వకుర్తి ద్వారా రోజుకు 0.4 టీఎంసీ , ఎస్‌ఎల్‌బీసీ ద్వారా రోజుకు 0.5 టీఎంసీ, మొత్తంగా దాదాపుగా రోజుకు 3 టీఎంసీలు తరలించే సామర్థ్యంతో జోరుగా ముందుకెళ్తోంది. వీటికి తోడు 800 అడుగుల నుంచే విద్యుత్ ఉత్పత్తి పేరిట నీటిని వదిలేస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రత్యామ్నాయంగా వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమ లిఫ్ట్ స్కీంను చేపట్టాం. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకోలేని సంక్లిష్టమైన పరిస్థితుల్లో లిఫ్ట్ చేసి, అదే పోతిరెడ్డిపాడు కాల్వలోకి నీటిని ఎత్తిపోసి, ఇప్పటికే ఉన్న పాత రిజర్వాయర్లకు చేరవేయడమే ఈ పథకం ఉద్దేశం. నీటి కేటాయింపులు ఉన్నా, వినియోగించుకునే అవకాశం లేకపోతే ఆ కేటాయింపులకు సార్థకత ఏముంటుంది? అదనపు నీటి కేటాయింపులు, అదనపు రిజర్వాయర్లు లేనప్పుడు ఈ పథకం వల్ల ఎవరికి, ఏం నష్టం వస్తుంది? ప్రజల దాహార్తిని తీర్చే ఇన్సూరెన్స్ లాంటి రాయలసీమ లిఫ్ట్ స్కీంను భూతద్దంలో చూపించడం భావ్యమా?
దురదృష్టవశాత్తూ, దాదాపుగా పూర్తయిన రాయలసీమ లిఫ్ట్ పనులను చంద్రబాబుగారు అధికారంలోకి రాగానే, ఎక్కడ జగన్‌కు పేరువస్తుందోనని ఆపేశారు. ఈ పథకాన్ని పూర్తిచేయాల్సింది పోయి, ఎవరైనా అభ్యంతరం చెప్తే, దాని ఆవశ్యకతను బలంగా వినిపించాల్సిందిపోయి, హాట్‌లైన్ రాజకీయాలకోసం బలిపెట్టారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న కరువులాంటి విపత్కర పరిస్థితుల్లో హక్కుగా కేటాయించిన నీటిని కూడా వినియోగించుకునే అవకాశాన్ని దెబ్బతీసి, రాయలసీమ ప్రజల ప్రాణాధారానికే ఉరివేశాడు.
ఎవరికీ నష్టం కలిగించని ఈ పథకంపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదు.

#RayalaseemaLiftIrrigation
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 26, 2026