NTV Telugu Site icon

YS Jagan: జగన్‌ 2.0 వేరుగా ఉంటుంది.. వైసీపీ అధినేత కీలక వ్యాఖ్యలు

Ys Jagan

Ys Jagan

YS Jagan: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. విజయవాడ వైసీపీ కార్పోరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమైన వైఎస్‌ జగన్.. ఆ సమావేశంలో మాట్లాడుతూ.. ఈ సారి జగన్ 2.0ని చూడబోతున్నారు.. ఈ 2.0 వేరేగా ఉంటుందని తెలిపారు.. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా.. తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను.. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయానన్న ఆయన.. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశాను.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టను అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.. ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలపెడతా.. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రయివేటు కేసులు వేస్తాం అని వార్నింగ్‌ ఇచ్చారు జగన్‌..

Read Also: America : ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన చోరీ.. అమెరికాలో లక్ష గుడ్లు మాయం

ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా ఉంటుంది. కచ్చితంగా చెబుతున్నా.. జగనన్న 1.0 లో కార్యకర్తలకు అంత గొప్పగా చేయలేకపోయిండవచ్చు. ప్రతి పథకం, ప్రతి విషయంలో మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకువచ్చి వారి కోసమే తాపత్రయపడ్డాను. ప్రజల కోసమే అడుగులు వేశానన్న జగన్… ఇప్పుడు చంద్రబాబు మన కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూశాను. కార్యకర్తల బాధలను గమనించాను. వారి అవస్ధలను చూశాను. వీళ్ల కోసం మీ జగన్ అండగా ఉంటాడని భరోసా ఇచ్చారు.. రాజకీయాలలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి. కానీ, కష్టాలు ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నా కథ గుర్తుకుతెచ్చుకొండి అని సూచించారు.. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. నా మీద కేసులు వేసింది కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులే అన్నారు.. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నానన్న కారణంతో దొంగకేసులు బనాయించి 16 నెలలు జైల్లో పెట్టారు. బయటకు వచ్చి, ప్రజల అండదండలతో ముఖ్యమంత్రి అయ్యాను. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు.

Read Also: Indian Migrants: అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్న ఫ్లైట్.. అమృత్‌సర్‌లో దిగిన 205 మంది

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరిస్తారు, దొంగకేసులు పెడతారు. జైల్లో పెడతారు. కానీ, రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం. మీకు మంచి చేసిన వారినీ, చెడు చేసిన వారినీ ఇద్దరినీ గుర్తుపెట్టుకొండి అని సూచించారు వైఎస్‌ జగన్‌.. ప్రతినెలా ఏ పథకాన్ని అమలు చేస్తామో క్యాలండర్ విడుదల చేసి ప్రజలు ఇబ్బందులు పడుకుండా అమలు చేసిన ప్రభుత్వం దేశ చరిత్రలో వైసీపీ మాత్రమేనన్న ఆయన.. ఏ గ్రామంలో చూసినా బెల్టుషాపునకు 2 లక్షలకో, 3లక్షలకో ఎమ్మెల్యే దగ్గరుండి వేలం పాడిస్తున్నారు. పోలీసులు దగ్గరుండి మద్యం అమ్మేలా సపోర్టు చేస్తున్నారు. ఏ గ్రామంలో చూసినా మద్యమే కనిపిస్తోందని విమర్శించారు.. మున్సిపాలిటీలలో టీడీపీకి మెజారిటీ లేకపోయినా వైసీపీ నేతలను బెదిరింపులకు, ప్రలోభాలకు గురిచేసి తమ వైపుకు తిప్పుకుంటున్నారు.. కొందరు ధైర్యంగా నిలబడ్డారు.. అందుకు ఎంతో గర్విస్తున్నాను అన్నారు.. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాం.. కనుకనే స్దానిక సంస్దల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయగలిగాం.. కోవిడ్ లాంటి విపత్కర సమయాల్లో కూడా రెండేళ్ల పాటు ప్రజలకు కారణాలు చెప్పకుండా పథకాలు అమలు చేశాం.. ఎన్నికల్లో ఓడినా తలెత్తుకుని ప్రజల దగ్గరకు కాలర్ ఎగరేసుకుని వెళ్లగలం.. టీడీపీ నేతలకు ఇప్పుడా పరిస్థితి లేదన్నారు.

Read Also: STR : డేరింగ్ డెసిషన్ తీసుకున్న తమిళ స్టార్ హీరో శింబు

ప్రజలకు ఏరోజూ అబద్దాలు చెప్పలేదు. ఏదైతే చెప్పామో అది చేసి చూపించిన తర్వాతే వాళ్లను ఓట్లడిగాం.. కాబట్టి ప్రజల దగ్గర విలువ తగ్గలేదన్నారు జగన్.. మ్యానిఫోస్టోలో సూపర్ సిక్స్ లు.. సూపర్ సెవెన్ లంటూ అశచూపి మోసం చేశారని ఫైర్‌ అయిన ఆయన.. టీడీపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎన్నికలప్పుడు హామీలు అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకొండని అన్నాడు. కానీ, ఈ రోజు ప్రజలు కాలర్ పట్టుకుంటారని భయపడి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు.. ఎన్నికలు అయిన 9 నెలల తర్వాత ఇవాళ సంపద సృష్టించడం ఎలాగో చెవిలో చెబితే తెలుసుకుంటానంటున్న చంద్రబాబు.. ఎన్నికల ప్రచారంలో చెప్పాను. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని.. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమేనని చెప్పా.. ఎన్నికల సమయంలో మనవాళ్లు కూడా నా దగ్గరకు వచ్చి మనం కూడా సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ చెబుదామన్నారు. కానీ, నేను ఒక్కటే చెప్పా.. రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేయడం అనవసరం అని చెప్పా.. ఏదైతే చేయగలుగుతామో అదే చెప్పాలి. చేయలేనిది చెప్పి, ప్రజలను మోసం చేయడం ధర్మం కాదని చెప్పా. ఓడిపోయాం ఫర్వాలేదు. ప్రతిపక్షంలో కూర్చున్నాం అదీ ఫర్వాలేదన్నారు.

Read Also: AAP vs BJP: ఢిల్లీ ఎన్నికల పోలింగ్ లో ఉద్రిక్తత.. కొట్టుకున్న ఆప్- బీజేపీ పార్టీల కార్యకర్తలు

ఇక, జమిలి అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అదే విలువలు, విశ్వసనీయత అన్న పదం మీద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరలా అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు వైఎస్‌ జగన్‌.. ప్రజలకు చంద్రబాబు నైజం పూర్తిగా అర్ధం అవుతుంది. చంద్రబాబు ప్రభుత్వం రాకమునుపు మన ప్రభుత్వంలో ప్రతిదీ పగడ్భందీగా జరిగింది.. ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడనే చర్చ ప్రతి ఇంటిలోనూ జరుగుతుంది. నాడునేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం.. అమ్మఒడి ఇచ్చాం.. ఫీజు రియంబర్స్మెంట్ లు ఇచ్చాం.. పేదవాడకి ఆరోగ్యం బాగాలేకపోతే నెట్ వర్క్ ఆసుపత్రులకు వెళ్తే ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించే పరిస్దితి లేదన్నారు.. మొట్టమొదటసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ కనీ,వినీ ఎరుగని విధంగా గ్రామాల్లో విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేశామని గుర్తుచేసిన ఆయన.. ఇప్పుడు ఇసుక ఎక్కడ చూసినా రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా.. ఇండస్ట్రీ నడపాలన్నీ, మైనింగ్ చేసుకోవాలన్నా.. ఏ పనికైనా నా కింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలై చంద్రబాబు వరకు పంచుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు.. 9 నెలల కాలంలోనే కూటమి నేతలు దారుణంగా తయారయ్యారని విమర్శలు గుప్పించారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్..