YS Jagan: నేడు శ్రీకాకుళం జిల్లా నేతలతో సమావేశంకానున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. క్యాంప్ కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతోన్న రాజకీయ పరిణామాలపై దృష్టిపెట్టిన వైఎస్ జగన్.. పార్టీ బలోపేతం.. నాయకత్వంలో ధైర్యం.. భరోసా నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.. అందులో భాగంగా.. వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.. ఇక, కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలపై పోరుకు సిద్ధమైంది వైసీపీ. జనం పడుతున్న ఇబ్బందులపై నిలదీయాలంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు పార్టీ అధినేత జగన్. తొలి విడతలో రైతులు, విద్యార్థులు, విద్యుత్ సమస్యలపై పోరాటం చేయనుంది. ఈ నెల 11, 27 తారీఖులతో పాటు వచ్చే ఏడాది జనవరి 3న నిరసన కార్యక్రమాలకు జగన్ పిలుపునిచ్చిన విషయం విదితమే..
Read Also: Bitcoin Price: లక్ష డాలర్స్‌ను దాటేసిన బిట్‌కాయిన్.. అంతా ట్రంప్ వల్లనేనా?
రైతుల సమస్యలపై ఈ నెల 11న ర్యాలీలు నిర్వహించాలని… కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని వైసీపీ శ్రేణులకు సూచించారు జగన్. పెట్టుబడి సహాయంగా 20 వేల రూపాయలు ఇవ్వాలని, ధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలని, ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని డిమాండ్ చేయనుంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న వైసీపీ ఆందోళన చేయనుంది. ఎస్‌ఈ, సీఎండీ కార్యాలయాలకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రాలు ఇవ్వనున్నారు ఆ పార్టీ శ్రేణులు. వచ్చే ఏడాది జనవరి 3న ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఆందోళన చేయనుంది వైసీపీ.. ఫీజు రియింబర్స్‌మెంట్, వసతిదీవెన బకాయిలు ఇవ్వాలని కోరనుంది. విద్యార్థులతో కలెక్టరేట్లకు ర్యాలీగా వెళ్లి… వినతిపత్రాలు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించిన విషయం తెలిసిందే.