NTV Telugu Site icon

YS Jagan: నెల్లూరు జిల్లా నేతలతో జగన్‌ భేటీ..

Ys Jagan

Ys Jagan

YS Jagan: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. వరుసగా వివిధ జిల్లాల నేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతూ వస్తున్న విషయం విదితమే.. ఇప్పటికే పలు జిల్లాల నేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించిన జగన్‌.. తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ నిర్మాణంపై చర్చిస్తున్నారు.. కష్టసమయంలోనే గట్టిగా నిలబడాలని.. ఇబ్బందులు వస్తే.. నన్ను గుర్తు చేసుకోవాలని చెబుతూ వస్తున్నారు.. ఇక, ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన నేతలతో వైసీపీ అధినేత జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరవుతారు. సమావేశంలో భాగంగా జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై వైసీపీ అధినేత జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాలో నెలకొన్న సమస్యలు, తదితర అంశాలపై నెల్లూరు జిల్లా నేతలతో వైఎస్ జగన్ చర్చించే అవకాశం ఉంది..

Read Also: Bangladesh: షేక్ హసీనా సహా 97 మంది పాస్‌పోర్టులు రద్దు..

మరోవైపు, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. యునైటెడ్ కింగ్డమ్ (యూకే) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. తాజా పాస్ పోర్టు పొందేందుకు అవసరమైన నిరభ్యంతర పత్రాన్ని జారీ చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.. ఐదేళ్ల కాల వ్యవధితో వైఎస్‌ జగన్ కు పాస్ పోర్ట్ జారీ చేయాలని పాస్ పోర్ట్ అధికారులను ఆదేశాలు జారీ చేసింది. తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవం కోసం ఈ నెల 16వ తేదీన యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేసుకున్న అభ్యర్థనలు ఆమోదం తెలిపింది హైకోర్టు.. ఎన్‌వోసీ ఇవ్వాలంటే స్వయంగా కోర్టు ముందు హాజరై 20 వేలతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాల్సిందేనన్న ప్రత్యేక కోర్టు ఆదేశాలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం విదితమే..

Show comments