YS Jagan Key Meeting: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ప్రతీ నెలలో కచ్చితంగా ఒకసారి పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతూ ఫీడ్ బ్యాక్ అప్‌డేట్ చేస్తున్నారు.. నేతలతో వరుస సమావేశాల్లో భాగంగా ఇవాళ వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు జగన్.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం కానున్న జగన్.. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు..
Read Also: Israel-Gaza War: నేటితో గాజా-ఇజ్రాయెల్ వార్ రెండేళ్లు పూర్తి.. కొలిక్కిరాని ట్రంప్ శాంతి చర్చలు
ఈనెల 9న తొలిసారి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై పోరుబాటకు వైసీపీ సిద్ధమైన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.. ఇప్పటి వరకు కూటమి సర్కార్ వ్యతిరేక విధానాలపై వైసీపీ ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు వంటివి వివిధ రూపాల్లో చేస్తున్నా కేవలం పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రమే హాజరవుతూ వచ్చారు.. 9వ తేదీన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ప్రత్యక్ష పోరుకు ఆయన సిద్ధమయ్యారు.. దీంతో సమావేశంలో మెడికల్ కళాశాలల పీపీపీ అంశం, రాష్ట్రంలో నకిలీ మద్యం సహా పలు కీలక విషయాలపై చర్చించే అవకాశం ఉంది.. పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశాల్లో జగన్ 2.0 తో డిజిటల్ బుక్ వంటి సంచలనాలకు తెర తీసిన జగన్.. ఇవాళ్టి సమావేశంలో నేతలకు ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది..
