YS Jagan: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన.. వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. సూపర్ సిక్స్ మోసాలు, రైతులు పడుతున్న అవస్థలు, పార్టీ శ్రేణులపై కూటమి సర్కార్ వేధింపులు, మెడికల్ కాలేజీల వ్యవహారం ఇలా పలు అంశాలపై పార్టీ నేతలు, కేడర్‌కు దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి రీజనల్ కో-ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలపై విరిచుకుపడ్డారు జగన్.. చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్న ఆయన.. సంపద సృష్టిస్తానని, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఇస్తానని చంద్రబాబు అన్నారు.. విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ అన్నింటా తిరోగమనమే. కేవలం 15 నెలల్లోనే ఈ ప్రభుత్వం ప్రజల్లో అంత వ్యతిరేకత మూట గట్టుకుంది.. ఎన్నికల్లో సూపర్ సిక్స్‌పై పేపర్లే ఇచ్చిన ప్రకటనను ఇప్పుడు మార్చేశారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పెన్షన్ ఎత్తివేశారు. అట్టర్ ప్లాప్ అయిన సూపర్ సిక్స్‌పై బలవంతపు విజయోత్సవాలు చేస్తున్నారు. ఈ స్థాయిలో మోసం చేసే వారు ప్రపంచంలోనే ఎవరూ ఉండరు అని విరుచుకుపడ్డారు.
Read Also: Kalyani Priyadarshan : నేను ఏ అనాధాశ్రమంలోను గడపలేదు.. తప్పుడు ప్రచారాలు ఆపండి
చంద్రబాబు హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు జగన్.. ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. యూరియా దొరకడం లేదు. 5 ఏళ్ల వైయస్సార్‌సీపీ పాలనలో ఇలాంటి పరిస్థితులు లేవన్నారు.. ప్రభుత్వమే దళారులతో చేతులు కలిపి, యూరియా పక్కదోవపట్టిస్తోంది. బ్లాక్‌లో యూరియాను రూ.300 ఎక్కువకు అమ్ముతున్నారు. బియ్యాన్ని ఇథనాల్ తయారీకే వాడాలని చెప్తున్నాడు. దీని అర్థం ధాన్యానికి ఇక ధరలు రావని చంద్రబాబు చెప్పకనే చెప్తున్నాడని దుయ్యబట్టారు.. మిగిలిన పంటలకు కూడా గిట్టుబాటు ధరలు రావడంలేదు. వైయస్సార్‌సీపీ హయాంలో ధరల స్థిరీకరణకు రూ.7,800 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.. ఫీజురియింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు పేరుకుపోయాయి. ఆరోగ్యశ్రీని నాశనం చేశారు. ఏకంగా రూ.3500 కోట్లు బకాయి పెట్టారు.. ఆరోగ్య ఆసరా లేనే లేదన్నారు.. అయితే, మన ప్రభుత్వంలో ఏటా రూ.450 కోట్లు ఖర్చు పెట్టాం.. కానీ, ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త మెడికల్ కాలేజీలు అమ్ముతామంటున్నాడు. బుద్ది ఉన్న వాడెవడైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీ అమ్ముతాడా? ఎక్కడైనా ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రులు, ఆర్టీసీ బస్సులు నడుపుతుంది?.. ప్రభుత్వం ఆ పని చేయకపోతే, ప్రైవేటు రంగం నుంచి సామాన్యులకు ఆ సేవలు అందవు. వారికి ఎదురు ఉండదు.. ఏదీ కూడా ప్రైవేటు రంగం నుంచి పేదలకు అందదు. దానికి చెక్ పెట్టడం కోసమే, ప్రభుత్వం వాటిని స్వయంగా నడుపుతుంది.. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. ఒక మెడికల్ కాలేజీ వస్తే, అక్కడ ఒక సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి వస్తుంది.. వైద్య నిపుణులు, నర్సులు వస్తారు.. అందరి సేవలు అందుతాయి. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడి అరి కట్టాలంటే.. అవి అవసరం. ఇంకా మెడికల్ సీట్లు. పేదలకు కూడా ఉచితంగా సీట్లు దొరుకుతాయి. దీని వల్ల మెడికల్ సీట్లు పెరుగుతాయి. డాక్టర్లు ప్రతి చోటా అందుబాటులో ఉంటారని వెల్లడించారు జగన్.
అమరావతిలో కనీస సదుపాయాలకే రెండు లక్షల కోట్లు పెట్టడతామంటున్నారు.. కానీ, మెడికల్ కాలేజీలకు రూ.5వేల కోట్లు పెట్టలేమంటూ అమ్మేస్తున్నారు అని విమర్శించారు జగన్.. ప్రభుత్వ లెక్కల ప్రకారమే అమరావతిలో మొదటి దశ నిర్మాణాల కోసం లక్ష కోట్లు కావాలి.. గతంలో చంద్రబాబు దాదాపు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయగా, మిగిలిన రూ.95 వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? అని ప్రశ్నించారు. ప్రస్తుతం అమరావతి 50 వేల ఎకరాల్లో ఉంటే, మరో 50 వేల ఎకరాలు కావాలట? మెడికల్ కాలేజీల కోసం రూ.5 వేల కోట్లు పెట్టరట.. కానీ, అమరావతిలో లక్ష కోట్లు పెడుతున్నారని విమర్శించారు.. మద్యం, ఇసుక, మట్టి, క్వార్ట్జ్, సిలికా.. దేన్నీ వదలడం లేదు. అన్నీ దోచేస్తున్నారు. కరెంట్‌ను యూనిట్ రూ.4.50 కి కొనేందుకు పీపీఏలు చేస్తున్నారు. దోపిడీ వల్ల ఖజానాకు ఆదాయం రావడం లేదు. మొత్తం వారి జేబుల్లోకి పోతోందని ఆరోపించారు. మన హయాంలో ఇసుక అమ్మకాల ద్వారా ఏటా రూ.750 కోట్లు రాగా, ఇప్పుడు ఒక్క పైసా రావడంలేదన్న జగన్.. 15 నెలల్లో రూ.2 లక్షల కోట్ల అప్పు చేశారు.. మనం 5 ఏళ్లలో చేసిన అప్పులో 15 నెలల్లోనే 58 శాతం చేశారు.. అందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు.. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లలేడు. సజావుగా ఎన్నికలు జరిగితే, ఆయనకు డిపాజిట్లు రావు.. ఆ విషయం ఆయనకు తెలుసు. అందుకే ఎన్నికలు సజావుగా జరిగేలా చూడడు. కాబట్టి, మీరు గట్టిగా నిలబడాలి. పోరాడాలని పిలుపునిచ్చారు..
మనం పార్టీ పెట్టి 14 ఏళ్లు.. మనం ఇంత బలంగా ఉండడానికి కారణం వైయస్సార్‌సీపీ ఫ్యామిలీ.. ప్రతి కార్యకర్త పార్టీని భుజాన వేసుకున్నాడు అని తెలిపారు జగన్.. మొన్న ఎన్నికల్లో అందరూ ఒకవైపు. మనం ఒక్కరమే ఒకవైపు.. అయినా 40 శాతం ఓట్లు సాధించాం. అందుకు మన కార్యకర్తలే కారణం. డిసెంబర్ 15 కల్లా అన్ని కమిటీల ఏర్పాటు పూర్తికావాలి.. సంక్రాంతి నాటికి వారికి ఐడీ కార్డులు ఇస్తాం.. రేపు ప్రభుత్వం రాగానే వారికి మంచి చేస్తాం.. వారి ద్వారా ప్రజలకు మంచి చేస్తాం.. మనం అధికారంలోకి వస్తే, వారి ద్వారా ప్రభుత్వాన్ని నడిపిస్తాను.. ప్రతి పథకాన్ని వారి ద్వారా నడుపుతాం.. విద్యార్థి, మహిళ, యువత, ఎస్సీ, రైతు.. ఇలా ఏడు విభాగాలు గ్రామస్థాయిలో ఏర్పాటు కావాలన్నారు జగన్.. ఇక, రాష్ట్రంలో అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా నిలబడడం కోసం డిజిటల్ బుక్ తీసుకొచ్చాం.. ఒక పోర్టల్ అయితే, రెండోది ఐవీఆర్‌ఎస్ విధానం. digitalbook.weysrcp.comలో ఫిర్యాదు చేయవచ్చు.. 040-49171718 నంబర్‌కు ఐవీఆర్‌ఎస్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చు అన్నారు జగన్.. అన్యాయానికి గురైనవారు ఫిర్యాదు చేయవచ్చు. రేపు మనం అధికారంలోకి రాగానే, బాధ్యులు ఎక్కడున్నా వదిలిపెట్టం. సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్ అయినా వదిలిపెట్టం.. పిలిపిస్తాం.. చట్టం ముందు నిలబెడతాం. ఈరోజు వారు రెడ్‌బుక్ అంటున్నారు. రేపు మనం డిజిటల్ బుక్ ఏమిటన్నది చూపిస్తాం.. అని హెచ్చరించారు వైఎస్ జగన్..
