YS Jagan: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో తమ ప్రభుత్వ హయాంలో తప్పు జరిగిందనే విధంగా చూపించేందుకు కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఏపీ చరిత్రలోనే మా హయాంలో జరిగిందే అత్యంత చవకైన విద్యుత్ కొనుగోలు అని స్పష్టం చేశారు.. కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్సెంటీవ్ ఇస్తామని చెప్పింది.. రూ.5.10 నుంచి రూ.2.49కి యూనిట్ ధర తగ్గింది.. మనకు 15 వే9ల మి.యూ. విద్యుత్ వినియోగం ఉంది.. దీని వల్ల లక్ష కోట్లు ఆదా చేయడం సంపద సృష్టి కాదా? అని ప్రశ్నించారు.. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇంత మంచి ఆఫర్ వచ్చినప్పుడు.. దానిని పక్కన పెడితే మీరు నన్ను ఏమనేవారు? అని ప్రశ్నించిన జగన్.. సీఎం చంద్రబాబు తెలిసి తెలిసి చేస్తున్నది ధర్మేనా? అని నిలదీశారు..
Read Also: Ajmer Dargah: అజ్మీర్ దర్గా నిజంగా శివాలయమా..? ఆధారాలు ఏం చెబుతున్నాయి..?
ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం.. ఒప్పందం జరిగింది కేంద్ర ప్రభుత్వం(సెకి), రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమేనని స్పష్టం చేశారు జగన్.. చరిత్రలోనే నిలిచిపోయే అత్యంత చవకైన ఈ ఒప్పందంపై బురద జల్లడం దారుణం అన్నారు.. రైతులకు ఉచిత కరెంట్ అనేది ఒక కల.. దీనివల్ల రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి.. చంద్రబాబు హయాంలో డిస్కంల పరిస్థితి దయనీయంగా మారింది. డిస్కంలను నిర్వీర్యం చేశారాయన. చంద్రబాబు చేసిన సోలార్ పవర్ ఒప్పందాలు రూ.5.90తో చేసుకున్నారు. డిస్కంల అప్పులను 86 వేల కోట్లకు పెంచారు. మా హయాంలో డిస్కంలను నిలబెట్టే ప్రయత్నం చేశాం. పగటి పూటే రైతులకు 9 గంటల కరెంట్ ఇవ్వగలిగాం.. ఉచిత కరెంట్ కోసం రూ.9 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.. అయితే, ఆ టైంలో యూనిట్‌ను 2.40 నుంచి 2.50 రూ. చొప్పున సప్లై సేందుకు 24 బిడ్లు వచ్చాయి. కానీ, ఆ ప్రక్రియకు కొన్ని శక్తులు అడ్డుపడ్డాయి.. కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారు.. దీనికోసం మేం కోర్టులో కూడా పోరాడాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు..
ఇంత చవకైన ధరకు ఇంతకు ముందు ఎన్నడూ విద్యుత్ కొనుగోలు జరగలేదన్నారు వైఎస్ జగన్.. చంద్రబాబు హయాంలో 20214-19 మధ్య 133 పీపీఏలు చేశారు.. విండ్ పీపీఏలు యూనిట్‌కు రూ.4.80 చేసుకున్నారు.. ఇక, సోలార్ విద్యుత్ అయితే యూనిట్‌కు రూ.6.99 వరకు ఒప్పందాలు చేసుకున్నారని.. విండ్ పవన్ యావరేజ్ రూ.4.63కు యూనిట్ కొనుగోలు చేశారు.. సోలార్ పవర్ యావరేజ్ రూ.5.90కు యూనిట్ కొనుగోలు చేశారని చెప్పుకొచ్చిన జగన్.. కేంద్రం అంత మంచి ఆఫర్ ఇస్తే స్పందించిన నేను మంచోడినా..? అంత దిక్కుమాలని ఒప్పందాలు చేసుకున్న చంద్రబాబు మంచోడా..? అని ప్రశ్నించారు.. చంద్రబాబు సోలార్ ఒప్పందాల వల్ల ఏడాదికి రూ.2 వేల కోట్ల అదనపు భారం.. 25 ఏళ్లకు అంటే రూ.50వేల కోట్లు అదనపు భారం అవుతుందనిన్నారు.. మేం లక్ష కోట్లు ఆదా చేసేందుకు ప్రయత్నిస్తే.. చంద్రబాబు 80 వేల కోట్లు ఆవిరి చేసే ఒప్పందాలు చేసుకున్నారని దుయ్యబట్టారు.. ఇక, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..