Site icon NTV Telugu

YS Jagan: వైఎస్‌ జగన్‌కు హైకోర్టులో ఊరట..

Ys Jagan

Ys Jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో మాజీ సీఎం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌కు ఊరట లభించింది.. తన పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు వైఎస్‌ జగన్‌.. అయితే, ఐదేళ్ల పాటు పాస్‌పోర్ట్‌ను రెన్యువల్‌ చేయాలని తీర్పు వెలువరించింది హైకోర్టు.. పాస్‌పోర్ట్‌ విషయంలో ప్రజాప్రతినిధుల కోర్టు ఏడాదికి పరిమితం చేసిన రెన్యువల్‌ను ఐదేళ్లకు పెంచుతూ తీర్పు ఇచ్చింది ఏపీ హైకోర్టు..

Read Also: CM Revanth Reddy: ఏ సమస్య వచ్చినా.. బాధ్యతలు నిర్వహించేది పోలీసులే..!

కాగా, పాస్ పోర్ట్‌ రెన్యూవల్‌పై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ హైకోర్టులో సవాల్‌ చేశారు వైఎస్‌ జగన్‌.. మరోవైపు.. సీబీఐ కోర్టు పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌కు ఐదేళ్లు అనుమతిస్తే, విజయవాడ కోర్టు కేవలం ఏడాదికి అంగీకారం తెలిపింది.. ఇక, ఈ పిటిషన్‌పై హైకోర్టులో ఇప్పటికే ఇరువైపు వాదనలు ముగియగా.. ఈనెల 11న ఈ వ్యవహారంపై నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు పేర్కొన్న విషయం విదితమే కాగా.. ఈ రోజు తీర్పు వెలువరించింది హైకోర్టు.. పాస్ పోర్ట్ కు ఐదేళ్ల పాటు రెన్యువల్ చేసేలా ఆదేశాలు ఇచ్చింది.. అయితే, విజయవాడ ప్రజా ప్రతినిధులు కోర్టు ఆదేశాలు ప్రకారం 20 వేల పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.. మొత్తంగా ప్రజా ప్రతినిధుల కోర్టు ఏడాదికి పరిమితం చేసిన పాస్ పోర్ట్ రెన్యువల్‌ను ఐదేళ్లకు పెంచుతూ హైకోర్టు తీర్పు వెలువరించడంతో.. వైఎస్‌ జగన్‌కు ఊరట లభించింది.

Exit mobile version