Site icon NTV Telugu

YS Jagan: బాబుగారూ.. సీఎంగా దశాబ్ధాల అనుభవం ఏం నేర్పింది..?

Jagan

Jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజార్చటంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. తన హయాం, చంద్రబాబు హయాంలోని పరిస్థితులను తెలుపుతూ ట్వీట్టర్ వేదికగా వివరాలను తెలియజేశారు. చంద్రబాబు గారూ.. సీఎంగా దశాబ్ధాల అనుభవం ఉందని చెప్పుకునే మీకు ఆ అనుభవం ఏం నేర్పింది? అని ప్రశ్నించారు. వైసీపీ ఐదేళ్ల హయాంలో తీసుకున్న అప్పులో మీరు ఇప్పటికే 44 శాతం తీసుకున్నారు అని వైఎస్ జగన్ ఆరోపించారు.

Read Also: Thug Life: కమల్ హాసన్ క్షమాపణ చెప్పకుంటే సినిమా రిలీజ్ కాదు: కర్ణాటక ఫిలిం ఛాంబర్..

కానీ, ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేదు, ఎలాంటి అభివృద్ది చేయలేదు అని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కాగ్, మోస్పీ సంస్థలు సైతం మీ అసమర్ధ, ఆర్థిక దుర్వినియోగాన్ని గణాంకాలతో సహా వాస్తవాలను వెల్లడించాయని ఆయన తెలియజేశారు.

Exit mobile version