Site icon NTV Telugu

CM Chandrababu: వైఎస్‌ జగన్ అక్రమాలు విచారించాలంటే 30 ఏళ్లు పడుతుంది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu: మరోసారి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పోలవరం పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్‌ జగన్ పాలనలో జరిగిన వివిధ అక్రమాలపై విచారణకు సుదీర్ఘ సమయం పడుతుంది.. దీనికి సుమారు 30 సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. వైఎ్‌ జగన్ అక్రమాలు ఒకటి, రెండు కాదు.. ఆయన పాలనలో వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చేశారని వ్యాఖ్యానించారు.. అయితే, ఈ కేసులను విచారిస్తూ కాలయాపన చేయలేం అని స్పష్టం చేశారు చంద్రబాబు..

Read Also: Jemimah Rodrigues: బ్యాట్ తోనే కాదు.. గిటారుతో కూడా అదుర్స్ అనిపించేలా జెమియా రోడ్రిగ్స్ పెర్ఫార్మన్స్ అదుర్స్..!

2019లో ప్రభుత్వం మారిన నాటి నుంచి పోలవరం ప్రాజెక్టుకు అన్ని నష్టాలే జరిగాయి.. ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ కాపాడుకోవడానికి కనీస జాగ్రత్తలు తీసుకోలేకపోయారు అని మండిపడ్డారు సీఎం చంద్రబాబు.. ఆరు సంవత్సరాల కంటే ముందే ప్రారంభం కావాల్సిన ప్రాజెక్ట్ గత ప్రభుత్వ తప్పిదాలతో మరొక 6 ఏళ్లు ఆలస్యం అవుతుందన్న ఆయన.. బట్రెస్ డ్యామ్ పూర్తయ్యింది.. గ్యాప్ 1 జూన్ కి పూర్తి కావాలని లక్ష్యం పెట్టుకున్నాం.. గ్యాప్ 2 పనులు 2027 జూన్ నాటికి పూర్తి అవుతాయి.. 41.15 మీటర్ల వరకు ప్రాజెక్ట్ జనవరి 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నాం అని వెల్లడించారు

మరోవైపు, ప్రాజెక్టులపై అన్యాయం జరుగుతుందని పర్యటనలు చేస్తే నన్ను గతంలో అరెస్ట్ చేశారని గుర్తు చేసుకున్నారు చంద్రబాబు.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నాకంటే గౌరవం పొందినవాళ్లు లేరన్నారు చంద్రబాబు.. ఇంకుడు గుంతలు తవ్విస్తే నన్ను ఎగతాళి చేశారు.. కానీ, గ్రౌండ్ వాటర్ రీచార్జ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాం.. ఇపుడు గ్రౌండ్ వాటర్ పెరగం చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉంది అన్నారు.. భూమినే జలాశయంగా చేసుకోవాలి అని సూచించారు.. రైతుల ఆత్మహత్యల విషయానికీ చంద్రబాబు స్పష్టం చేశారు.. ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదు. సమస్యలను తగిన విధంగా పరిష్కరించడం అవసరం అని అన్నారు సీఎం చంద్రబాబు..

Exit mobile version