Site icon NTV Telugu

Youtube Academy in AP: ఏపీలో యూట్యూబ్ అకాడమీ.. సీఎం చంద్రబాబు కీలక చర్చలు

Cbn

Cbn

Youtube Academy in AP: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులే లక్ష్యంగా పనిచేస్తోంది కూటమి ప్రభుత్వం.. రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సర్కార్‌ ఏర్పడిననాటి నుంచి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై దృష్టిసారిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఇక, ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ అడుగుపెట్టనుంది.. ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబ్‌ అకాడమీ ఏర్పాటు కాబోతోంది.. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు సీఎం చంద్రబాబు..

Read Also: Brain Eating Amoeba: మరో ముగ్గురికి సోకిన మెదడును తినే అమీబా.. చెరువులో స్నానం చేయడానికి వెళ్లి..

యూట్యూబ్ గ్లోబల్ సీఈవోతో చర్చలు జరిపిన విషయాన్ని ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆన్ లైన్‌లో యూట్యూబ్ గ్లోబల్ సీఈవోతో చర్చలు జరిపినట్లుగా ట్వీట్‌ చేశారు.. యూట్యూబ్ గ్లోబల్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ APAC హెడ్ సంజయ్ గుప్తాలతో సమావేశమయ్యాను. లోకల్ పార్టనర్లతో కలిసి యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయాలని ఆహ్వానించాం. కంటెంట్, స్కిల్ డెలవప్‌మెంట్, ఏఐ, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ వంటి వాటిపై ప్రత్యేకంగా అకాడమీలో పరిశోధనలు చేయవచ్చు అన్నారు.. అందుకే అమరావతిలో భాగమైన మీడియా సిటీలో యూట్యూబ్ అకాడమీని ఏర్పాటు చేయమని కోరినట్టు సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కాగా, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గతంలో నిలిచిపోయిన రాజధాని అమరావతి పునర్ నిర్మాణంపై దృష్టిసారించిన సీఎం చంద్రబాబు.. మరోవైపు.. ప్రతిష్టాత్మక సంస్థలను కూడా ఆ రాజధానికి రప్పించే విధంగా ప్రయత్నాలు సాగిస్తోన్న విషయం విదితమే.

https://x.com/ncbn/status/1820733474933797250

Exit mobile version