Site icon NTV Telugu

YCP Women Wing: రేపు నిరసన కార్యక్రమాలకు వైసీపీ మహిళా విభాగం పిలుపు..

Ycp

Ycp

YCP Women Wing: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకుంది.. ఈ నేపథ్యంలో, వైసీపీ వరుస కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు విఫలం అయ్యారని.. మాట ఇచ్చి ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’ పేరుతో నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు, వైసీపీ మహిళా విభాగం కీలక నిర్ణయం తీసుకుంది.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ మహిళా విభాగం.. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదని ఆరోపిస్తోంది.. అందుకు నిరసనగా జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం..

Read Also: Ponnam Prabhakar: గౌడ్‌ల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుంది.. 40 లక్షల తాటి మొక్కలు సిద్ధం!

కాగా, రాష్ట్రంలో వైసీపీ నేతలను టార్గెట్‌ చేసి అరెస్ట్‌ చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.. సంబంధంలేని కేసులతో.. వైసీపీ నేతలను జైళ్లకు పంపుతున్నారని.. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు.. ఇక, ఆంధ్రప్రదేశ్‌ అరాచకానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది.. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి.. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ఏడాది కాలంగా నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా, ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నారు అంటూ.. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఫైర్ అయిన విషయం విదితమే..

Exit mobile version