Site icon NTV Telugu

Zakia Khanam: వైసీపీకి మరో బిగ్‌ షాక్‌..! లోకేష్‌ను కలిసిన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్

Zakia Khanam

Zakia Khanam

Zakia Khanam: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరో బిగ్‌ షాక్‌ తప్పదా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది.. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు.. వైసీపీకి గుడ్‌బై చెప్పి.. తెలుగుదేశం కండువా కప్పుకుంటుండగా.. ఈ రోజు శాసనమండలి లాబీలో మంత్రి నారా లోకేష్‌ను కలిశారు వైసీపీ ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్‌పర్సన్ జకియా ఖానమ్.. ఇప్పటికే ఆమె మంత్రి ఫరూఖ్ తో సమావేశమై.. పలు కీలక అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది.. మరోవైపు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చట్టసభలను బహిష్కరించినా.. రెగ్యులర్‌గా మండలి సమవేశాలకు హాజరవుతూనే ఉన్నారు జాకియా ఖానమ్.. ఇక, ఈ రోజు మంత్రి నారా లోకేష్ తో ఆమె కుటుంబసభ్యులతో కలిసి సమావేశం కావడం చర్చగా మారింది.. ఈ భేటీలో ఆమె.. పార్టీలో చేరడంపై క్లారిటీ వచ్చిందని.. త్వరలో తెలుగుదేశం పార్టీలో జాకియా ఖానమ్ చేరుతున్నారంటూ పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది.

Read Also: Minister Nara Lokesh: ఇంకా రెడ్ బుక్ తెరవలేదు.. అప్పుడే గగ్గోలు..

Exit mobile version