Site icon NTV Telugu

YSRCP: పోలీసు వ్యవస్థ దిగజారి పోయింది..! ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయింది..!

Manohar Reddy

Manohar Reddy

YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థ దిగజారి పోయిందని.. ప్రజలకు స్వేచ్చ లేకుండా పోయిందని ఆరోపించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి.. పోలీసులను ప్రభుత్వ పెద్దలు ఇష్టానుసారం వాడుకుంటున్నారని.. నల్లపాడు పీఎస్ పరిధిలో జరిగిన ఒక హత్య కేసులో మా పార్టీ కార్యకర్తను అరెస్టు చేశారన్నారు.. మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలో వైసీపీ తరపున గట్టిగా నిలబడ్డాడని వీరయ్య అనే తమ పార్టీ కార్యకర్తను అరెస్టు చేశారన్నారు.. మధ్యవర్తినామాలో పోలీసులు ఇష్టానుసారం రాసుకుని సంతకం చేయించుకున్నారన్నారు.. ఇది పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమని.. నకిలీ మద్యం కేసు గురించి కాశీబుగ్గలో ధర్నా చేశారని.. తమ వారిపై ఏకంగా హత్యాయత్నం కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.. ధర్నా చేస్తే పోలీసుల మీదనే హత్యాయత్నం చేసినట్టు కేసు పెట్టారని.. కోర్టు బెయిల్ ఇస్తుందని ఏకంగా మర్డర్ కేసులు, హత్యాయత్నం కేసులు పెడుతున్నారన్నారు.. కక్ష పూరిత రాజకీయాలతో రాష్ట్రాన్ని శ్మశానంలా మారుస్తున్నారన్నారు.. అలాంటి వారు బుద్ధి మార్చుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతారన్నారు.. హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారని.. అలాంటి వారంతా భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి..

Read Also: Bengaluru: వాష్‌రూంలో సీనియర్‌ విద్యార్థినిపై రేప్.. ‘‘పిల్ కావాలా.?’’ అంటూ..

Exit mobile version