YS Jagan Padayatra: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరోసారి వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తారనే చర్చ సాగుతూ వచ్చింది.. కొన్ని సందర్భాల్లో ఆయన కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని.. అవసరం అయితే, మరోసారి పాదయాత్ర చేస్తాను అంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతూ వచ్చారు..అయితే, ఈ రోజు పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు జరిగిన యువ విభాగ సమావేశంలో పాదయాత్రపై క్లారిటీ ఇచ్చారు జగన్.. ముందుగా జిల్లాల పర్యటనలు ఉంటాయని.. ఆ తర్వాత చివర్లో పాదయాత్ర ఉంటుంది.. మీతో కలిసి ప్రయాణం చేసే రోజులు రాబోతున్నాయి అని వ్యాఖ్యానించారు వైఎస్ జగన్..
Read Also: India vs Bangladesh Series : ఇండియా బంగ్లాదేశ్ సిరీస్ జరిగేనా…
ఇక, పార్టీ ప్రారంభించిన కొత్తలో అందరూ కొత్తవాళ్లే.. పార్టీ పెట్టిన కొత్తలో నేను, మా అమ్మ మాత్రమే ఉన్నాం.. నా మీద వ్యక్తిగతంగా అభిమానం ఉన్నవాళ్లు నాతో వచ్చారు అని గుర్తుచేసుకున్నారు వైఎస్ జగన్.. నా ప్రస్థానం అక్కడ నుంచి మొదలయ్యింది.. ఎన్ని కష్టాలు వచ్చినా, విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేశాం.. రాజకీయంగా ఇబ్బందులు వచ్చినా రాజీ పడలేదన్నారు.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడం అనేది రాజకీయాల్లో ఎంతో ముఖ్యమని, అందుకు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించాలని యువ విభాగాన్ని ఉద్దేశించి ఆదేశాలు జారీ చేశారు.. అయితే, యూత్ వింగ్ అనేది పార్టీలో క్రియాశీలకమైంది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర పోషించాలని సూచించారు జగన్… పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలి. లీడర్లుగా ఎదిగేందుకు ఇప్పుడు గొప్ప అవకాశమని పేర్కొన్నారు..
Read Also: Pashamylaram Blast: పటాన్ చెరువు కెమికల్ ఫ్యాక్టరీలో మృతులకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి..
మరోవైపు, ఉప ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీ నాకు వచ్చింది అని గుర్తుచేశారు వైఎస్ జగన్… దాంతో, పార్లమెంటులో ప్రతి సభ్యుడూ మనవైపు చూసే పరిస్థితి వచ్చింది.. కానీ, దానిని జీర్ణించుకోలేక మనమీద పగబట్టారు.. 18 మంది ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తే.. వాళ్లందరిచేతా రాజీనామా చేయించాను. ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించాం. ఆ ఉప ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కలిసే పోటీచేశాయి అని విమర్శించారు.. 2014లో 67 మందితో గెలిచాం.. మళ్లీ మన దగ్గర నుంచి 23 మందిని లాక్కున్నారు. అయితే, ఎన్నికష్టాలు వచ్చినా, విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేశాం. రాజకీయంగా ఇబ్బందులు వచ్చినా రాజీ పడలేదన్నారు.. ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది చాలా ముఖ్యం. ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ప్రజలకు తోడుగా నిలబడాలి.. మంచి పలకరింపు అన్నది కూడా చాలా ముఖ్యం. ఇవి చేయగలిగితే.. లీడర్‌గా ఎదుగుతారని యూత్ వింగ్ సమావేశంలో దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
