Gold Bangles for Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టింది.. అమరావతి పునఃనిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానిక ప్రధాని నరేంద్ర మోడీ రావడం.. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మరింత జోష్ నింపింది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్.. ఇక, రెండో దశ భూ సేకరణకు సిద్ధమవుతోన్న వేళ.. రాజధాని నిర్మాణానికి దాతల నుంచి విరాళాలు వస్తున్నాయి.. రాజధాని అమరావతి నిర్మాణానికి ఇద్దరు మహిళలు విరాళం ఇచ్చారు. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలనే మంచి ఆలోచనతో తమవంతు సాయం అందించారు.
Read Also: YS Jagan: రేపు వైఎస్ జగన్ కీలక సమావేశం.. దానిపై నిర్ణయం తీసుకుంటారా?
సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన తెనాలి, విజయవాడకు చెందిన ఇద్దరు మహిళలు.. 4 చేతి గాజులు, నగదును విరాళంగా ఇచ్చారు. తెనాలికి చెందిన నన్నపనేని ఉదయలక్ష్మీ 36 గ్రాముల 546 మిల్లీగ్రాముల బంగారు గాజులను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. నాలుగు బంగారు గాజులతో పాటు మరో రూ.1 లక్ష చెక్కును విరాళంగా అందించారు. రాజధాని నిర్మాణానికి ఈ మొత్తాన్ని వెచ్చించాలని కోరారు. అదేవిధంగా విజయవాడకు చెందిన వెలగపూడి చంద్రావతి రూ.50 వేలు విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా వృద్ధులైన ఆ ఇద్దరు మహిళలు రాష్ట్రానికి మంచి రాజధాని ఉండాలని ఆకాంక్షతో విరాళం ఇవ్వడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి అభినందించారు. వీరి ఔదార్యం, ఉదారత ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
