MLCs Resignation: ఏపీ శాసన మండలి సమావేశాలు హాట్ హాట్‌గా జరుగుతున్నాయి. వైసీపీ సభ్యులు ప్రతిరోజు అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. పార్టీకి, పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. మండలి ఛైర్మన్ మోషేను రాజును కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆయన పదవీకాలం 2029 వరకు ఉంది. ఈ సందర్భంగా గతంలో రాజీనామా చేసిన నలుగురు సభ్యుల రాజీనామా ఆమోదం తెరమీదికి వచ్చింది. ఆ పార్టీకి కర్రీ పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి, జయ మంగళ ఇప్పటికే రాజీనామాలు చేశారు. కానీ, వాళ్ల రాజీనామాలు కూడా పెండింగులోనే ఉన్నాయి.
Read Also: Ankle Shackles Sounds: రాత్రిపూట గజ్జల శబ్దం వినబడుతోందా?
మర్రి రాజశేఖర్ రాజీనామాతో టోటల్ వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలు ఐదుకు చేరాయి. అయితే వారి రిజైన్‌ని మండలి ఛైర్మన్ ఎప్పుడు ఆమోదిస్తారనే చర్చ జరుగుతోంది. ఈ ఐదుగురు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో మండలి చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టే ఆలోచనలో అధికారపార్టీ ఉందా? అనే కోణంలో కూడా డిస్కషన్ జరుగుతోంది. ప్రస్తుతం మండలి సభ్యులు 58 మంది. అవిశ్వాస తీర్మానం పెడితే కావలసిన నెంబర్ 30. ఒకవేళ ఈ నలుగురి రాజీనామాలు ఆమోదిస్తే 54 మందితోనే అవిశ్వాసం పెట్టాలి. అప్పుడు టీడీపీ నెగ్గాలి అంటే 28 మంది అవసరం. అందుకే ఎంతవీలైతే అన్నిరోజులు పెండింగ్‌లో ఉంచడానికే మండలి చైర్మన్ మొగ్గు చూపుతున్నారని సమాచారం. రాజీనామాలకు ఆమోదం తెలుపుతూ పోతే టీడీపీ బలం ఆటోమేటిగ్గా పెరుగుతుంది. ఆ ఛాన్స్ ఎందుకివ్వాలనే ఉద్దేశంతో పెండింగులో పెట్టినట్టు తెలుస్తోంది.