NTV Telugu Site icon

AP Rains: బలహీనపడిన అల్పపీడనం.. ఏపీ వ్యాప్తంగా వర్షాలు..

Rains

Rains

AP Rains: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, హైదరాబాద్‌ సహా తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు.. కొన్ని చోట్ల ముసురు పడుతోంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర అల్పపీడనంగా మారిన విషయం విదితమే కాగా.. ఆ తీవ్ర అల్పపీడనం ఈరోజు ఉదయం అల్పపీడనంగా బలహీనపడింది.. ఇక, అల్పపీడనం మరింత బలహీన పడి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది.. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి.. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి.. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పోర్టులకు 3వ నంబర్‌ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.. ఈ సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తుండగా.. నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు..

Read Also: CM Revanth Reddy: వారిద్దరిరూ నాతో తిరిగారు.. అల్లు అర్జున్‌పై నాకెందుకు కోపం..?

Show comments