Botsa Satyanarayana: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా డిమాండ్ ఆది నుంచి ఉంది.. గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం కావడంతో.. ప్రతిపక్ష హోదా కోల్పోయింది వైసీపీ.. అయితే, తమ పార్టీ మినహా అన్ని కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పార్టీలే కాబట్టి.. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది వైసీపీ.. ఇక, ఈ రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలోనే అది డిమాండ్ వినిపించింది వైసీపీ.. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ప్రారంభించగా.. ప్రతిపక్ష హోదా ఇవ్వండి.. ప్రజల గొంతు వినిపించేందుకు అవకాశం ఇవ్వండి అంటూ నినాదాలు చేశారు వైసీపీ సభ్యులు.. ఆ తర్వాత పోడియం వద్దకు దూసుకెళ్లడం.. కాసేపు నిరసన తెలిపిన తర్వాత.. గవర్నర్ ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేయడం జరిగిపోయాయి.. దీనిపై శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: PM Modi: ఊబకాయంపై యుద్ధం.. 10 మందిని నామినేట్ చేసిన మోడీ
అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశాం. ప్రజల పక్షాన మాట్లాడేది ప్రతిపక్షం అవసరం అన్నారు బొత్స.. అలాంటి హోదా తమకు ఇవ్వకుండా గొంతు నొక్కలని చూస్తున్నారని మండిపడ్డారు.. సభలో ఉన్నది రెండే పక్షాలు అని.. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పేంటి? అని నిలదీశారు.. మిర్చి రైతుల ఇబ్బందులు ప్రభుత్వ పట్టించుకోవటం లేదు. మా నేత జగన్ వెళ్ళే వరకు మిర్చి రైతుల ఇబ్బందులు పట్టించుకోలేదన్నారు.. ఇక, గవర్నర్ ప్రసంగం సమయంలో ప్రతిపక్ష హోదా డిమాండ్ చేశాం.. మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులు చూస్తున్నాం. జగన్ మిర్చి రైతుల దగ్గరకు వెళ్లాక ఆలోచించడం మొదలు పెట్టారని తెలిపారు.. రైతులకు న్యాయం చేస్తే సంతోషం.. కానీ, అసెంబ్లీలో రైతుల సమస్యలపై మాట్లాడాలి అంటే ప్రతిపక్ష హోదా కావాలన్నారు.. మిర్చి రైతుల పరామర్శలకు వెళ్తే కేసులు పెడతారు అని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. మ్యూజికల్ నైట్ కు ఇవేమీ ఉండవు అని దుయ్యబట్టారు.. ప్రతిపక్ష హోదా ఇవ్వడం పై ప్రభుత్వ స్పందన తర్వాత అసెంబ్లీకి వస్తామో లేదో చెబుతాం. లేకపోతే ప్రజల్లో ఉండి పోరాటం చేస్తాం అని ప్రకటించారు బొత్స సత్యనారాయణ..
Read Also: DK Aruna: తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం!
మిర్చి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి.. రైతుల గురించి పట్టించుకొనే వరకు పోరాటం చేస్తాం.. మిర్చి రైతుల సమస్యలపై కేంద్రంతో మాట్లాడుతాం అంటున్నారే కానీ ముందుకు వెళ్లలేదని విమర్శించారు బొత్స.. మిర్చి యార్డుకు వెళ్తే మా నాయకుడు మీద కేసులు పెడుతున్నారు.. మ్యూజికల్ నైట్ లు పెట్టుకుంటే లీగల్ అంట.. ఇవన్నీ అడగాలంటే మా పార్టీని ప్రతిపక్షంగా గుర్తించాలని కోరుతున్నాం.. సూపర్ సిక్స్ అన్నారు.. సెవెన్ అన్నారు.. పెన్షన్ తప్ప ఒక్క హామీ నెరవేర్చలేదు.. గ్యారెంటీ అంటే మోసం అని అర్థం అవుతుంది.. ప్రభుత్వం ప్రతిస్పందన చూసి అసెంబ్లీకి హాజరయ్యే విషయం ఆలోచిస్తాం.. ప్రభుత్వం స్పందించక పోతే మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం అన్నారు బొత్స సత్యనారాయణ..