Vijayasai Reddy: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అంటూ బాంబ్ పేల్చిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. 25వ తేదీన రాజ్యసభకు రాజీనామా చేస్తానని శుక్రవారం రోజే ప్రకటించారు.. అయితే, ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం.. ఎలాంటి ఒత్తిళ్లు లేవు.. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు.. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను అంటూ ఆయన పేర్కొన్న విషయం విదితమే.. నిన్న సోషల్ మీడియాలో ప్రకటించిన విధంగానే రాజీనామాకు సిద్ధం అయ్యారు.. మరికాసేపట్లో అంటే ఉదయం 10.40 గంటలకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కడ్ తో భేటీకానున్నారు సాయిరెడ్డి.. తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి అందజేయనున్నారు..
Read Also: Phone Tapping Case: త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్..
కాగా, రాజీనామా చేస్తానంటూ ప్రకటించిన సాయిరెడ్డి.. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్ కి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మకి సదా కృతజ్ఞుడిని అని పేర్కొన్న విషయం విదితమే.. జగన్ కి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీకి, హోం మంత్రి అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలు.. టీడీపీతో రాజకీయంగా విభేదించా.. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవు.. పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం అంటూ ఆయన ట్వీట్ చేసిన విషయం విదితమే..