Site icon NTV Telugu

Vijayasai Reddy: మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..? నిజమెంతా..?

Vijayasai Reddy

Vijayasai Reddy

Vijayasai Reddy: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కీలక వ్యక్తిగా, వైఎస్‌ జగన్‌కు దగ్గరివాడిగా పేరు పొందిన విజయసాయిరెడ్డి.. రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించడం సంచలనమైంది.. వైసీపీకి మాత్రమే రాజీనామా చేయడం కాదు.. తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రిజైన్‌ చేశారు సాయిరెడ్డి.. అయితే, కొన్ని రోజుల తర్వాత విజయసాయిరెడ్డి మళ్లీ వైసీపీలోకి వస్తారనే ప్రచారం సాగుతూ వస్తోంది.. కొన్నిసార్లు ఆయన ఖండించినా.. ఈ వ్యవహారానికి తెరపడటంలేదు.. అసలు సాయిరెడ్డి రీ ఎంట్రీలో నిజమెంతా?

Read Also: HYD Mudra Cheater: ముద్ర లోన్స్‌ పేరుతో 500 మంది మహిళలను మోసం.. రూ. 3 కోట్లతో పరార్‌

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ లండన్‌ పర్యటనలో ఉన్న సంమయంలో వైసీపీతో పాటు, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు విజయసాయిరెడ్డి.. జగన్‌ చుట్టూ ఉన్న కోటరీ కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం చేశారు.. తాను ఇక రాజకీయాల్లో కొనసాగబోనని.. ఏ పార్టీలోనూ చేరేది లేదని.. వ్యవసాయం చేసుకుంటానని చెప్పేశారు..

Read Also: Krishna Arrest: లైంగిక వేధింపుల కేసులో మరో డాన్స్ మాస్టర్.. విచారణలో సంచలన విషయాలు..

అలాగే కాకినాడ సీపోర్ట్‌ కేసు వ్యవహారంలో విచారణకు హాజరైన సాయిరెడ్డి.. ఊహించని విధంగా లిక్కర్‌ కేసు గురించి మాట్లాడడం.. అప్పట్లో కలకలం రేపింది.. ఆ రోజు విజయసాయిరెడ్డి.. ఆ రోజు సాయిరెడ్డి అందించిన లింక్‌తోనే సిట్‌.. మద్యం కేసు డొంక కదిలించగలుగుతోందన్న అభిప్రాయం ఉంది.. అదే సమయంలో తాను జగన్‌కు నష్టం కలిగించబోయే పనులు చేయబోనని స్పష్టం చేశారు.. పార్టీలో జగన్‌ తర్వాత తానే అన్న స్థానం నుంచి.. కోటరి వల్లే దూరం కావాల్సి వచ్చిందని తన మనస్సులోని మాట బాయటపెట్టారు.. అయితే, సాయిరెడ్డి తన మనస్సు మార్చుకుని పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.. విజయసాయిరెడ్డిని జగనే ఆహ్వానించినట్టు టాక్‌.. అయితే, ఈ ప్రచారం నిజమా? కల్పితమా? అనేదాని కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

Exit mobile version