NTV Telugu Site icon

AP Pensions: కొనసాగుతోన్న పెన్షన్ల వెరిఫికేషన్‌… ఆ తర్వాతే తొలగింపు..!

Ap Pension

Ap Pension

AP Pensions: ఆంధ్రప్రదేశ్‌లో తప్పుడు పత్రాలతో వేలాది మంత్రి ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. తప్పుడు మార్గంలో మెడికల్‌ సర్టిఫికెట్లు పొంది.. వాటితో దరఖాస్తు చేసుకుని పెన్షన్ల రూపంలో ప్రభుత్వ సొమ్ము నొక్కేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.. అయితే, ఏపీలో 8 లక్షల 18 వేల పెన్షన్ల కు సంబంధించి వేరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.. దివ్యంగుల పెన్షన్.. వివిధ వ్యాధులకు సంబంధించి ఇబ్బంది పడుతున్న వారి పెన్షన్లపై ప్రధానంగా దృష్టిసారించింది ప్రభుత్వం.. అందులో భాగంగా తనిఖీలు నిర్వహిస్తోంది.. కిడ్నీ, హార్ట్ ప్రాబ్లెమ్, తలసేమియా.. ఇలా వివిధ కేటగిరీలుగా పెన్షన్ పంపిణీ జరుగుతోంది. నకిలీ సర్టిఫికెట్‌లతో పెన్షన్ తీసుకునేవారిని గుర్తించే పని పడిపోయింది ప్రభుత్వం.

Read Also: Onion Juice: ఈ రసం ఒక గ్లాస్ తాగితే చాలు నిమిషాల్లో కడుపు నొప్పి మాయం

అయితే, మూడు నెలల పాటు ఈ తనిఖీ ప్రక్రియ కొనసాగించనున్నారు.. జిల్లా స్థాయి అధికారులు… మెడికల్ టీమ్‌, ఒక డిజిటల్ అసిస్టెంట్ సహాయంతో పెన్షన్ తనిఖీలు కొనసాగిస్తున్నారు.. ఇక, తనిఖీలు పూర్తయిన తర్వాత ఒక వేళ అవి నకిలీ సర్టిఫికెట్లు అని గుర్తిస్తే ముందుగా సంబంధిత పెన్షనర్లకు నోటీసులు ఇవ్వనున్నారు అధికారులు.. ఆ తర్వాత పెన్షన్ తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.. తనిఖీ చేసిన డేటా మూడు నెలల తర్వాత ప్రకటించాలా…? లేక ప్రతి 15 రోజులకు ప్రకటించి.. నిర్ణయం తీసుకోవాలా? అనే విషయంపై చర్చిస్తోంది ప్రభుత్వం.. కాగా, వైసీపీ హయాంలో భారీ సంఖ్యలో అనర్హులకు పెన్షన్లు నమోదు చేశారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది.. అంతేకాదు.. అవి నకిలీ పెన్షన్లు అని తేలితే.. లబ్ధిదారుల నుంచి.. పెన్షన్ల మొత్తాన్ని కూడా రికవరీ చేస్తామంటూ కూటమి నేతలు వ్యాఖ్యానించిన విషయం విదితమే..

Show comments