Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Us Consul General Jennifer Larson Meet Ap Deputy Cm Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌తో యూఎస్‌ కాన్సుల్ జనరల్ భేటీ

Published Date :July 30, 2024 , 2:18 pm
By Sudhakar Ravula
  • డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ భేటీ..
  • ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్‌కు అభినందనలు తెలిపిన జెన్పిఫర్..
  • ఏపీలో పెట్టుబడులకు.. అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చ..
  • రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందని.. పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం ఉందని వెల్లడి..
Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌తో యూఎస్‌ కాన్సుల్ జనరల్ భేటీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు యూ.ఎస్. కాన్సల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్.. మంగళగిరిలోని పవన్‌ కల్యాణ్‌ నివాసంలో ఈ రోజు ఉదయం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్‌కు అభినందనలు తెలియచేసి.. జ్ఞాపిక అందచేశారు యూఎస్‌ కాన్సల్‌ జనరల్.. ఇక ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ టీమ్‌ను సత్కరించారు పవన్‌.. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ సమావేశంలో.. ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు.. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందని.. పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని వెల్లడించారు పవన్‌ కల్యాణ్‌..

Read Also: CM Chandrababu: గిరిజన సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష..

ఇక, మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారని వెల్లడించిన పవన్ కల్యాణ్.. వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంలోనూ, ఉన్నత విద్యకు అమెరికా వెళ్లేవారికీ తగిన సహకారం, మార్గనిర్దేశనం అందించాలని కోరారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇక, పర్యావరణహితమైన కార్యక్రమాలకు ప్రోత్సాహం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూ.ఎస్. కాన్సల్ పొలిటికల్, ఎకనామిక్స్ విభాగం చీఫ్ ఫ్రాంక్ టాలుటో, ఆ విభాగం ప్రతినిధులు శ్రీమాలి కారే, సిబప్రసాద్ త్రిపాఠి పాల్గొన్నారు. కాగా, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరుసగా తన శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న పవన్ కల్యాణ్.. కీలక ఆదేశాలు జారీ చేస్తున్న విషయం విదితమే. గత ప్రభుత్వ హయాంలో ఆయా శాఖల్లో జరిగిన అవకతవకాలపై ఆరా తీస్తూ వస్తున్నారు పవన్ కల్యాణ్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravati
  • Andhra Pradesh
  • Deputy CM Pawan Kalyan
  • US Consul General Jennifer Larson

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions