Site icon NTV Telugu

Undavalli Arun Kumar Open Letter: డిప్యూటీ సీఎం పవన్‌కు ఉండవల్లి బహిరంగ లేఖ.. ఆ బాధ్యత మీదే..!

Undavalli

Undavalli

Undavalli Arun Kumar open letter: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు సీనియర్‌ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. 2014లో విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యతను పవన్ కల్యాణ్‌ తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు ఉండవల్లి.. బీజేపీతో కలిసి అధికారంలో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి రాబట్టుకోవడానికి పవన్ కల్యాణ్‌ శ్రద్ధ తీసుకోవాలని లేఖలో కోరారు.. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర విభజన అంశాన్ని కూడా ఒక కొలిక్కి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు..

Read Also: INDIA Bloc: రాజ్యసభ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విపక్షాలు

మొత్తంగా నాలుగు పేజీలతో కూడిన సుదీర్ఘ లేఖను పవన్‌ కల్యాణ్‌ను రాశారు ఉండవల్లి.. పార్లమెంట్‌లో రాజ్యసభ విభజన జరిగిన తీరును లేఖలో ప్రస్తావించిన ఆయనే.. ఈ విషయంపై నేను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ పదేళ్లుగా నడుస్తూనే ఉంది.. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కనీసం కౌంటర్‌ కూడా దాఖలు చేయలేదన్నారు.. గతంలో ఇలాంటి విషయాలను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాను.. రాష్ట్రం తరఫున సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయాలని నిర్ణయించారు.. కానీ, కారణాలేమైనా అవి అమలు కాలేదని పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, ఈ విషయంపై శ్రద్ధ తీసుకుని.. పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ విభజన జరిగిన తీరూ తర్వాత మనకు జరిగిన అన్యాయం విషయమై చర్చకు నోటీసులు ఇప్పించాలని.. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్‌లో పడిపోయిన రాష్ట్ర విభజన అంశాన్ని త్వరితగతిన ఒక కొలిక్కి తీసుకురావాలని.. మీ శ్రేయోభిలాషి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌..

 

ఇక ఉండవల్లి అరుణ్ కుమార్.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు రాసిన లేఖ.. ఇక్కడ చూ డొచ్చు..

 

 

 

Exit mobile version