TDP Politburo Key Decisions: తెలుగుదేశం పొలిట్‌బ్యూరో.. పార్టీ కార్యకర్తలకు గుడ్‌న్యూస్ చెప్పింది.. ఇప్పటికే పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి బీమా సదుపాయాన్ని కలిపిస్తున్న విషయం విదితమే కాగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని భారీగా పెంచినట్టు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.. టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు.. 12 అంశాల అజెండాతో పొలిట్ బ్యూరో జరిగింది.. పహల్గామ్‌లో ఉగ్రదాడిని పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించిందని తెలిపారు.. ఇక, టీడీపీ కార్యకర్తలకు కల్పించే బీమా సౌకర్యాన్ని రెండు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచేలా నిర్ణయం తీసుకున్నాం అని వెల్లడించారు. త్వరలో అన్నదాత సుఖీభవ మొదటి విడత చెల్లిస్తాం.. ఇక నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించి క్యాలెండర్ విడుదల చేస్తున్నాం.. ఏ నెలలో ఏ పథకం వస్తుంది అనేది క్యాలండర్ లో ఉంటుందని తెలిపారు.
Read Also: Pawan Kalyan : ఓజీ షూట్ కు పవన్.. ‘ఉస్తాద్’ కూడా ముగిస్తాడా..?
మండల పార్టీ అధ్యక్షులు మూడు పర్యాయాలు అంటే ఆరేళ్ల పాటు పదవిలో కొనసాగినవాళ్లు తప్పుకోవాలని పొలిట్ బ్యూరో లో నిర్ణయం తీసుకున్నాం అన్నారు అచ్చెన్నాయుడు.. మండల పార్టీ అధ్యక్షులు అంతకన్నా పెద్ద పదవిలోకి అయినా వెళ్లాలి.. లేదా వేరే కమిటీలో ఉండాలని సూచించారు.. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని రకాల కమిటీలు మహానాడు లోపు పూర్తి అవుతాయని తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు.. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం అందుకున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణని అభినందిస్తూ తీర్మానం చేసింది తెలుగుదేశంపార్టీ పొలిట్‌బ్యూరో. ఇక, దీపం 2 పథకం ద్వారా ఇచ్చే మూడు గ్యాస్ సిలిండర్లకు ముందుగా లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకుంది.. అలాగే జూన్ 12 నుంచి కొత్తగా లక్ష వితంతు పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
Read Also: Macherla: మాచర్ల మున్సిపల్ చైర్మన్‌కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు..
ఇక, టీడీపీ ఏపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. యుద్ధ వాతావరణం వల్ల మహానాడు చెయ్యాలా వద్దా అనే అనుమానం వచ్చింది.. కానీ, ఇప్పుడు పరిస్థితి సద్దుమనగడంతో మహానాడు నిర్వహిస్తున్నాం అన్నారు.. మహానాడులో మొదటి రెండు రోజులు.. జిల్లా, రాష్ట్ర కమిటీ నేతలు ఉంటారు.. మూడో రోజు గ్రామ కమిటీ సభ్యులు కూడా ఉంటారు. మొత్తం 70 వేల మంది ఈ మహానాడుకు హాజరవుతారని వెల్లడించారు.. మహానాడు జరిగే సికే దీన్నే ప్రాంతంలో ఎకమిడేషన్ సౌకర్యం లేదని చాలా మంది చెప్పారు. అయినా కూడా మహానాడు కడపలోనే చేయాలని నిర్ణయం తీసుకున్నాం.. ఈ నెల 27, 28, 29న మహానాడుని కడపలో ఘనంగా నిర్వహించనున్నాం అన్నారు పల్లా శ్రీనివాసరావు.
