Site icon NTV Telugu

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి.. కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ సంచలన వ్యాఖ్యలు‌..

Srinivas Varma

Srinivas Varma

Tirumala Laddu Controversy: కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ, NDDB రిపోర్ట్ ఆధారంగా అవినీతి, టెండర్ లో మినహాయింపులు మరియు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపించారు.. లడ్డూల తయారీకి ఉపయోగిస్తున్న నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆయన.. ఈ వ్యవహారంలో వైసీపీ నేతల వాదనలు హాస్యాస్పదంగా ఉన్నాయని మండిపడ్డారు.. వైసీపీ నేతల్లా అమ్మనా భూతులు తిట్టాలా‌..? లడ్డూ విషయంలో చాలా క్లీయర్ గా ఉన్నాం.. కల్తీ నెయ్యి విషయంలో పెద్ద ఎత్తు అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు.

Read Also: Maha Shivaratri Brahmotsavam 2026: శ్రీశైలంలో రేపటి నుంచే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు కీలక సూచనలు

వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు.. ఆ ముగ్గురు ఆ సమయంలో కలసి పని చేశారని తెలిపారు శ్రీనివాస వర్మ.. కానీ, ఇప్పుడు వైసీపీ నేతల మాటలు హాస్యాస్పదం‌గా ఉన్నాయి.. జంతువుల కొవ్వు కలిసిందని NDDB రిపోర్టు బయట పెట్టింది‌… దాన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు బయట పెట్టారు‌‌.. ఆ రిపోర్టును కూటమి ప్రభుత్వం ఏమీ తయారు చేయలేదు‌ కదా? అని ప్రశ్నించారు.. భోలే బాబాకు అసలు పాల ఉత్పత్తి లేదు‌.. డైరీ లేదు… పాలు లేదు కాని.. నెయ్యి చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు..

వైఎస్‌ జగన్‌కు క్లీన్‌చీట్‌ ఎవరు ఇచ్చారు‌.. చూపించండి? అని నిలదీశారు శ్రీనివాస వర్మ.. అయితే, వైవీ సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని.. తప్పు చేశామని ఒప్పుకున్నారు.. జగన్‌కు ఏంటి బాధ.. రికార్డులను ట్యాంపరింగ్‌ చేస్తే శిక్ష తప్పదు.. అలాంటి అవకాశం లేదు అని స్పష్టం చేశారు.. టెండర్లు నిబంధనలలో పెద్దఎత్తున మార్పులు చేశారు‌.. కేవలం అవినీతి కోసం అలా చేశారు.. ఆ నెయ్యితోనే స్వామివారికి హారతి ఇస్తాం‌… అలాంటి నెయ్యిని కల్తీ చేశారు అని మండిపడ్డారు.. 2022లో రిపోర్ట్‌ ఇస్తే.. ఎందుకు చర్యలు తీసుకోలేదు..? అని ప్రశ్నించారు.. అర్హత లేనివారికి ఎలా నెయ్యి కాంట్రాక్టు ఇస్తారు‌…? అని నిలదీశారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.

Exit mobile version