Site icon NTV Telugu

Janasena: కూటమి పాలనకు ఏడాది.. జనసేన కీలక నిర్ణయం..

Pawan Kalyan

Pawan Kalyan

Janasena: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పాలనకి ఏడాది పూర్తవడంతో జనసేన కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించనుంది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ నాయకత్వంలో ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన‌ ఏడాది ఉత్సవాలు చేస్తోంది జనసేన. సుపరిపాలన ప్రారంభమై ఏడాది.. పీడ విరగడై ఏడాది అంటూ, ఈ నెల 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరుపుకోవాలని జనసేన నిర్ణయించింది.

Read Also: Bayya Sunny Yadav: జ్యోతి మల్హోత్ర, భయ్యా సన్నీ యాదవ్‌ను కలిపి విచారిస్తున్న ఎన్‌ఐఏ..!

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పిలుపుతో జనసేన కూటమి ప్రభుత్వానికి ఏడాది ఉత్సవాలు నిర్వహిస్తోంది. జనసేన నేతలు, శ్రేణులు తమ వాకిళ్లను రంగవల్లులతో అలంకరించాలనీ, ముగ్గుల పోటీలు నిర్వహించాలనీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి దిశానిర్దేశం అందింది. దీంతోపాటు సాయంత్రం దీపావళి తరహాలో దీపాలు వెలిగించి, టపాకాయలు కాల్చాలని సూచించారు. ఈ వేడుకలన్నింటినీ సోషల్ మీడియాలో పోస్టులు రూపంలో ప్రదర్శించాలని పార్టీ కోరుతోంది. ఈ సందర్భంగా డిజిటల్ క్యాంపెయిన్‌కి కూడా జనసేన శ్రేణులు సిద్ధమవుతున్నాయి.

Read Also: Dasoju Sravan: సీఎం రేవంత్‌కి ఒక కన్ను రాహుల్ గాంధీ అయితే మరోకన్ను నరేంద్ర మోడీ..

సుపరిపాలన మొదలై ఏడాది… పీడ విరగడై ఏడాది.. సందర్భంగా 4వ తేదీన పండగలా నిర్వహించుకోవాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్.. సోషల్ మీడియాలో విస్తృతంగా ఈ వేడుకలపై డిజిటల్ క్యాంపెయిన్ చేయాలని.. సంక్రాంతి – దీపావళి కలబోసిన వేడుక నిర్వహించాలని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన వైసీపీ మూకలను రాష్ట్ర ప్రజలు తరిమివేసి ఏడాది పూర్తయింది. ఈ శుభ తరుణాన్ని పురస్కరించుకుని పండగ చేసుకుందామని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ నాయకులు, వీర మహిళలు, శ్రేణులకి కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చారు. ఈ నెల 4వ తేదీన సంక్రాంతి- దీపావళి పండుగను కలిపి చేసుకుందాము. ఈ వేడుకల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ లు చేయాలని, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టాలని దిశా నిర్దేశం చేశారు.

Exit mobile version