NTV Telugu Site icon

Chandrababu: తెలుగుదేశం ఓ రాజకీయ వర్సిటీ.. నేటితరం నేతల మూలాలు టీడీపీలోనే..

Cbn

Cbn

Chandrababu: తెలుగుదేశం పార్టీ ఓ రాజకీయ విశ్వవిద్యాలయం.. నేటితరం చాలా మంది తెలుగు రాజకీయ నాయకుల మూలాలు కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయి అన్నారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ పనిపోయిందన్న వాళ్ల పనైపోయింది.. కానీ, పార్టీ శాశ్వతంగా ఉంటుందన్నారు.. తెలుగుదేశం పార్టీ వారసులుగా భవిష్యత్తు తరాలకు ఆ ఫలాలు అందించే బాధ్యత మనది.. తెలుగుదేశం ముందు తెలుగుదేశం తర్వాత అన్నట్లుగా తెలుగుజాతికి గుర్తింపు వచ్చిందన్నారు.. కార్యకర్తలకు ఎప్పుడూ పెద్దపీఠ వేస్తూ వారి మనోభావాలు గౌరవించే పార్టీ తెలుగుదేశం.. యువతను ప్రోత్సహిస్తూ, పదవులు, అధికారాలు సామాన్యులకు, చదువుకున్న వారికి, అన్నివర్గాలకు అందించిన పార్టీ ఇది.. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు దేశంలోనే తొలిసారి ప్రమాద భీమా ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం.. ఈ వినూత్న ఆలోచనకు లోకేష్ శ్రీకారం చుట్టి ఎంతో పటిష్టం చేస్తూ వచ్చారని తెలిపారు.

Read Also: Kamakshi Bhaskarla : గ్లామర్ గేట్లు ఎత్తేసిన పొలిమేర-2 హీరోయిన్ ‘కామాక్షి భాస్కర్ల’

శాశ్వత సభ్యత్వం తీసుకునేందుకు ఇచ్చే రూ.లక్ష కూడా కార్యకర్తల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తాం అన్నారు చంద్రబాబు నాయుడు.. చనిపోయిన కార్యకర్తల పిల్లలు చాలామందికి ఎలిమెంట్రీ స్కూల్ నుంచి పీజీ వరకూ ఉచితంగా చదివిస్తున్నాం.. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పటిష్ట యంత్రాంగం ఉన్న పార్టీ తెలుగుదేశం.. జాతీయ భావoతో ముందుకెళ్తు ప్రతిభకు పెద్దపీట వేస్తాం.. జాతీయస్థాయిలో తెలుగుదేశం పోషించిన కీలకపాత్రలు మరే పార్టీకి సాధ్యంకాలేదన్నారు చంద్రబాబు.. ఇక, ఎక్కడ ఇసుక దందా జరుగుతున్నా తిరుగుబాటు చేయండి, నేను అండగా ఉంటాను అన్నారు.. మద్యం ఎమ్మార్పీ ధరపై ఒక్క రూపాయి కూడా ఎక్కువ చెల్లించవద్దని మందుబాబులను కోరుతున్నా.. మనం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానంలోకి చొరబడి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని వైసీపీ నేతలు యత్నించారు.. జీఎస్టీతో కలిపి 97 రూపాయలు అయ్యే సినరేజ్ ఛార్జీకి 35 రూపాయలకే టెండర్ వేస్తామంటూ వైసీపీ నేతలు వచ్చారు.. ఇసుక కొరత సృష్టించి బ్లాక్ మార్కెటింగ్ చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే అతి తక్కువ ధరకు టెండర్లు వేశారని మండిపడ్డారు. ప్రభుత్వానికి నష్టం వచ్చినా, ఉచిత ఇసుక స్ఫూర్తి దెబ్బతినకూడదనే సినరేజ్ ఛార్జీలు, జీఎస్టీ కూడా ఎత్తి వేశామని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు..