Site icon NTV Telugu

CM Chandrababu: టీడీపీ ఇక ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండదు.. సీఎం చంద్రబాబు హాట్‌ కామెంట్స్..

Babu

Babu

CM Chandrababu: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాట్‌ కామెంట్స్‌ చేశారు.. టీడీపీ ఇక ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండదంటూ తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతల భేటీలో చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. సుదీర్ఘ కాలం అధికారంలో కొనసాగుతాం అన్నారు చంద్రబాబు.. ఇక, పార్టీ కార్యకర్తల కోసం కూడా సమయం కేటాయిస్తానని తెలిపారు చంద్రబాబు.. ఇప్పటికే వీలు కుదిరినప్పుడల్లా టీడీపీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటున్న ఆయన.. పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుండగా.. ఇకపై వారంలో తానొక రోజు, లోకేష్ ఒకరోజు టీడీపీ ఆఫీస్‌లో రోజంతా అందుబాటులో ఉంటాం అన్నారు చంద్రబాబు.. గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినదానికి.. ఇప్పుడు పనిచేస్తున్నదానికి చాలా తేడా ఉందన్నారు చంద్రబాబు… ఇప్పుడు పనిచేస్తున్నంత వేగంగా ఎప్పుడూ చేయలేదని గుర్తు చేసుకున్నారు.. గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేస్తే.. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇప్పుడు గాడిన పెట్టాం అన్నారు చంద్రబాబు… పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశం అయిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా హాట్‌ కామెంట్లు చేశారు..

Read Also: Off The Record: అక్కడ కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లా విలవిలలాడుతున్న టీడీపీ నేతలు..!!

Exit mobile version