Site icon NTV Telugu

CM Chandrababu: నేడు టీడీపీ కీలక భేటీ.. ఇంటింటి ప్రచారంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..

Cm Chandrababu Ficci

Cm Chandrababu Ficci

CM Chandrababu: ఈరోజు ఉదయం 11గంటలకి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కన్వీనర్లు హాజరుకానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జులై 2వ తేదీ నుంచి కూటమి పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు సీఎం. సుమారు నెల రోజుల పాటు కూటమి పార్టీ నేతల ప్రచారం కొనసాగనుంది.. ఈ ఏడాది పాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా దీని ద్వారా ప్రచారం చేయనున్నారు..

Read Also: Off The Record: ఆ సమస్యను వైసీపీ లీడర్స్‌ ఎందుకంత లైట్‌ తీసుకున్నారు..?

అయితే, ఈ కార్యక్రమం ఎలా ఉండాలి..? ప్రజలకు ఎలాంటి విషయాలు వెల్లడించాలి.. కూటమి ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు ఏంటి..? చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయి. తదితర అంశాలపై పార్టీ నేతలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ దిశా నిర్దేశం చేయనున్నారు. అలాగే, టీడీపీ కమిటీలు కొత్త కార్యవర్గం ఇతర అంశాలపై ప్రధానంగా విస్తృత స్థాయి సమావేశం చర్చించనున్నారు.

Exit mobile version