ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కొందరు పోలీసు ఉన్నతాధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా.. ఎన్డీఏ పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ మాట్లాడుతూ.. ఏపీలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని తెలిపారు. కొందరు ఐపీఎస్ అధికారులు ఈ తరహా అధికార దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి, ఏపీ సీఈఓకి ఫిర్యాదు చేశామని బోండా ఉమ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో నేతలపై నమోదు చేసిన కేసుల వివరాలివ్వాలని కోరినా ఇవ్వడం లేదన్నారు. ఈ అంశంలో డీజీపీ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఎన్నిక సీఈఓకు ఫిర్యాదు చేశాం.. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించేలా సీఎం జగన్ ఆదేశాలిస్తున్నారని బోండా ఉమ తెలిపారు.
Read Also: Jabardasth Rohini: నల్లగా ఉన్నానని రిజెక్ట్ చేశారు.. ఆ ఛాన్స్ కూడా ఎవరు లేకపోతే..
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ.., ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే అవినీతి తగ్గాలి కానీ.. వైసీపీ ప్రజా ప్రతినిధులు దానిని ఉల్లంఘించి అక్రమాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికారులు తమకు తాము తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.. రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినా అక్రమ ఇసుక తవ్వకాలపై పట్టించుకోవడం లేదని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Water Crisis: బెంగళూర్ సంక్షోభం మొత్తం దేశానికి తప్పదా..? రిజర్వాయర్లలో 38 శాతం నీటి నిల్వలు..
