MLA Kolikapudi Srinivasa Rao vs MP Kesineni Chinni: తిరువూరు వ్యవహారంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వర్సెస్ ఎంపీ కేశినేని నాని వ్యవహారం రచ్చగా మారింది.. అయితే, తిరువూరు వ్యవహారంపై టీడీపీ అధిస్థానం సీరియస్ అయ్యింది.. సీఎం చంద్రబాబు వచ్చే వరకు ఇద్దరూ.. ఈ వ్యవహారంపై మాట్లాడవద్దు అంటూ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే కొలికపూడిని ఆదేశించింది పార్టీ అధిష్టానం.. అయితే, అంతకు ముందే టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు అపాయింట్‌మెంట్ కోరిన ఎమ్మెల్యే కొలికపూడి.. టీడీపీ ప్రధాన కార్యాలయానికి బయల్దేరారు.. కానీ, పార్టీ కార్యాలయానికి రావద్దు అంటూ టీడీపీ అధిస్థానం ఆదేశాలు జారీ చేసింది.. ఇక, అధిస్థానం ఆదేశాలతో తిరువూరులో ఉండిపోయారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. మరోవైపు, అనారోగ్యంతో తన నివాసానికే పరిమితం అయ్యారు ఎంపీ కేశినేని చిన్ని..
Read Also: Allu Arjun: ‘కాంతార 1’ చూసి ట్రాన్స్ లోకి వెళ్ళిపోయా.. అల్లు అర్జున్ ప్రశంసల వర్షం!
అయితే, దుబాయ్ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇప్పటికే ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు.. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఏ నేతలతోనూ సమావేశం కావాల్సిన అవసరం లేదని.. పార్టీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు చంద్రబాబు.. ఈ నేపథ్యంలోనే.. ఎలాంటి చర్చలు లేకుండా.. వివరణ తీసుకోకుండా.. సమావేశాన్ని రద్దు చేసింది టీడీపీ అధిష్టానం.. అయితే, చంద్రబాబు స్వదేశానికి వచ్చిన తర్వాత.. ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఫోకస్ పెట్టనున్నట్టుగా తెలుస్తోంది..
