NTV Telugu Site icon

CM Chandrababu: పెట్టుబడులపై ఫోకస్‌ పెట్టిన ఏపీ ప్రభుత్వం.. నేడు సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ భేటీ

Babu

Babu

CM Chandrababu: రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించి.. పరిశ్రమలు ఏర్పాటు చేయడంపై ఫోకస్‌ పెట్టారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పెట్టుబడుల సాధనే ప్రధాన లక్ష్యంగా దాదాపు ఆరేడు శాఖల్లో కొత్త పాలసీల రూపకల్పనపై కసరత్తు మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగించి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు విస్తృత ప్రయత్నాలు జరుపుతున్నారు ముఖ్యమంత్రి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మరోవైపు ప్రైవేటు సంస్థల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల తెచ్చేలా ప్రయత్నాలు సాగుతున్నాయి.. గతంలో వెనక్కి వెళ్లిన సంస్థలను మళ్లీ రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు..

Read Also: Taiwan Earthquake : 24 గంటల్లో రెండోసారి తైవాన్‌లో బలమైన భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.3గా నమోదు

ఇక, ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీకానున్నారు టాటా గ్రూపు ఛైర్మన్ నజరాజన్ చంద్రశేఖరన్. ఉదయం 10.30 గంటలకు టాటా గ్రూప్ ఛైర్మన్‌తో సమావేశం జరగనుంది.. అనంతరం సీఎంతో భేటీకానున్నారు CII ప్రతినిధుల బృందం. CII డీజీ చంద్రజిత్ బెనర్జీ నేతృత్వంలో ముఖ్యమంత్రితో భేటీకానున్నారు సీఐఐ ప్రతినిధులు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం తీసుకురానున్న నూతన పారిశ్రామిక విధానంపై సీఐఐ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. కాగా, అమరావతి రాజధాని ప్రాంతంతో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల పరిశ్రమలు ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.. ఇక, విశాఖపట్నంను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం విదితమే.