Site icon NTV Telugu

DGP Harish Kumar Gupta: సహజ మరణాలను లాకప్ డెత్‌లుగా ప్రచారం చేస్తే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్..

Dgp Harish Kumar Gupta

Dgp Harish Kumar Gupta

DGP Harish Kumar Gupta: సహజ మరణాలను లాకప్ డెత్‌లుగా పేర్కొంటూ అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చారు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. సహజ మరణాలను లాకప్‌డెత్‌లుగా పేర్కొంటూ కథనాలను వండి – వార్చి, వడ్డిస్తున్న పత్రికలు మరియు సోషల్ మీడియా ఖాతాలపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.. ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్.? పేరిట అసత్య కథనాలను ప్రచారం చేస్తున్న వారిపై పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందన్న ఆయన.. ఇలాంటి వార్తలు ప్రభుత్వాన్ని మరియు పోలీసు విభాగాన్ని అపఖ్యాతిపర్చే దురుద్దేశంతో పుకార్లు, అబద్ద ప్రచారాలు చేసే సోషల్ మీడియా ఖాతాలపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.. సహజ మరణాలను లాకప్ డెత్ లు గా చేస్తున్న అవాస్తవ ప్రచారాలు ప్రజలను తప్పుదారి పట్టించడమే కాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలకు ముప్పుగా మారే ప్రమాదం ఉంది.

Read Also: Off The Record: కవితపై సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారా..?

అయితే, విచారణలో భాగంగా, ఈ కేసుకు సంబంధించిన అనుమానితలను మరియు సాక్షులను చట్టబద్దంగా ప్రశ్నించడం జరిగింది. ఎవ్వరినీ అక్రమంగా అరెస్టు చేయడం గాని, లాకప్ హింసకు పాల్పడటం గాని జరుగలేదని స్పష్టం చేశారు డీజీపీ.. మృతుని కుటుంబ సభ్యులను, బంధువులను బెదిరించడం గాని, బలవంతం చేయడం గాని జరగలేదన్న ఆయన.. వాస్తవాలకు విరుద్ధంగా. ప్రజలను తప్పుదోవ పట్టించేలా, పోలీస్ శాఖను అపఖ్యాతి పరిచే విధంగా కథనాలను ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.

Exit mobile version