NTV Telugu Site icon

Speaker Ayyannapatrudu: జగన్ తీరుపై స్పీకర్ అసహనం

Speaker Ayyannapatrudu

Speaker Ayyannapatrudu

Speaker Ayyannapatrudu: మాజీ సీఎం జగన్ తీరు పై అసహనం వ్యక్తం చేశారు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు.. గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కలిగించడం మంచి సంప్రదాయం కాదన్నారు.. సభ్య సమాజం తలదించుకునేలా జగన్ వైఖరి ఉందన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకూడదు అని స్పష్టం.. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు.. గవర్నర్ ప్రసంగం పై వైసీపీకి అభ్యంతరాలు ఉంటే చెప్పచ్చు.. సభకు వచ్చి మాట్లాడచ్చు.. కానీ, ప్రసంగానికి ఆటంకం కలిగించడం మాత్రం మంచి పద్దతి కాదన్నారు.. ఇలాంటివి మళ్లీ పునరావృతం కావొద్దన్నారు.. నిన్న పరిణామాలు చాలా బాధ అనిపించిందన్నారు స్పీకర్‌.

Read Also: Maha Shivratri 2025: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రముఖ శైవక్షేత్రాలు ఇవే!

అసెంబ్లీకి గవర్నర్ అతిధిగా వచ్చారు.. గవర్నర్‌ను అందరూ గౌరవించాలని అని సూచించారు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు.. నిన్న జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గు పడేలా ఉంది.. ఒక ముఖ్యమంత్రి గా పని చేసి.. పార్టీ అధ్యక్షుడుగా ఉండి.. సభ్యత మర్చిపోయి ప్రవర్తించారని వైఎస్‌ జగన్‌పై మండిపడ్డారు.. కూర్చుని జగన్ నవ్వుకుంటున్నారు.. పైగా వారి సభ్యులను ఎంకరేజ్ చేస్తున్నారని దుయ్యబట్టారు.. కాగితాలు చింపి పోడియం పై విసిరారు.. ఇది పద్ధతి కాదు.. సంప్రదాయం కాదని హితవుచెప్పారు.. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు.. పక్కన ఉన్న సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా తోడ్పాటు అందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు..