Site icon NTV Telugu

Heavy Rain Forecast: చల్లని కబురు.. ఏపీకి ముందుగానే నైరుతి రుతుపవనాలు

Visakharain

Visakharain

Heavy Rain Forecast: రైతులకు చల్లని కబురు.. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను ముందుగానే పలకరించబోతున్నాయి.. కేరళ తీరాన్ని ముందుగానే తాకనున్నాయి నైరుతి రుతుపవనాలు.. ఐదు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తాయని ఇప్పటికే ఐఎండీ అంచనా వేసింది.. దక్షిణ, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో విస్తరించి చురుగ్గా కదులుతున్నాయి రుతుపవనాలు.. ఇక, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వచ్చే వారం రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, వైఎస్సార్ కడప, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. ఈ సమయంలో తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది వాతావరణశాఖ..

Read Also: Hyderabad: హైదరాబాద్ నుంచి ఫ్రాంక్ ఫోర్ట్ వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో 160 మంది ప్రయాణికులు

కాగా, ఇప్పటికే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు.. మరికొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు.. అయితే, ఈ సారి వర్షాలు సంవృద్ధిగా కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలపై రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు..

Exit mobile version