NTV Telugu Site icon

South Central Railway: విద్యుత్‌ ఛార్జీలు పెంచొద్దు.. ఏపీఈఆర్సీకి సౌత్‌ సెంట్రల్‌ రైల్వే వినతి..

Aperc

Aperc

South Central Railway: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ఇప్పటికే ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరిగాయి.. అయితే, ఇప్పుడు ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (APERC)కి సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఓ లేఖ రాయడం చర్చగా మారింది.. ప్రజా ప్రయోజనం కోసం విద్యుత్ ఛార్జీలు పెంచవద్దు అంటూ ఏపీఈఆర్సీకి విజ్ఞప్తి చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే.. వంద శాతం‌ ఎలక్ట్రిక్ రైళ్లను నడపాలని ధ్యేయంగా పెట్టుకున్నాం.. కానీ, విద్యుత్ ఛార్జీలను పెంచితే సామాన్య ప్రజలపై.. ప్రయాణాల పైనా భారం పడుతుందని పేర్కొంది.. రైలు ప్రయాణం ఛార్జీలు పెరగకూడదంటే ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెరగకూడదన్న సౌత్ సెంట్రల్‌ రైల్వే.. ఏపీలో యూనిట్ ధర 7.89గా ఉంది.. అదే తెలంగాణలో యూనిట్ ధర 7.13గా ఉందని.. ఇక, కర్నాటక, మహారాష్ట్ర, రాజస్ధాన్ లలో 6.10 రూపాయల నుంచి 6.60 రూపాయల మధ్యలో యూనిట్ ధర ఉందని తెలిపింది.. అయితే, ఎలా చూసుకున్నా ఇప్పటికే ఏపీలో విద్యుత్ యూనిట్ ధర ఎక్కువగా ఉంది.. కానీ, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (APERC)కి విజ్ఞప్తి చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే..

Read Also: RBI: ఖాతాదారులకు RBI గుడ్ న్యూస్.. ఇకపై బ్యాంకులు మీకు రోజుకు రూ. 100 చెల్లింపు!

Show comments