NTV Telugu Site icon

Somuveerraju: ఎమ్మెల్సీగా సోము వీర్రాజు ప్రమాణం.. టీడీపీ-జనసేన-బీజేపీది ఒకే ఆలోచన..

Somu Veerraju

Somu Veerraju

Somuveerraju: టీడీపీ – జనసేన – బీజేపీ ఒకే ఆలోచనతో ఉన్నాయి.. అది ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి అన్నారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన.. ఈ రోజు శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు.. సోము వీర్రాజు చేత ప్రమాణం చేయించారు మండలి చైర్మన్ మోషేన్ రాజు.. ఇక, అనంతరం మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు.. కీలక వ్యాఖ్యలు చేశారు.. ఏపీ ముఖచిత్రాన్ని అభివృద్ధి రూపంలో మార్చాలని సీఎం చంద్రబాబు సంకల్పంతో ఉన్నారని తెలిపారు.. అమరావతిలో రాజధాని అభివృద్ధి చేస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్‌, అమరావతి అభివృద్ధికి కేంద్ర సహకారం కూడా ఉంటుందన్నారు.. ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లాంటి నగరం నిర్మాణం జరుగుతోంది.. ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రకాలుగా సహకరిస్తున్నారని వెల్లడించారు. అన్ని అంశాల్లో ఏపీకి సహాయం అందుతోంది.. స్వర్ణాంధ్ర ఏర్పాటు లక్ష్యంగా కూటమి ముందుకు వెళ్తోందన్నారు.. ఇక, టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే ఆలోచనతో ఉన్నాయి.. రాష్ట్రం అభివృద్ధే అజెండాగా పనిచేస్తున్నామని తెలిపారు.. మరోవైపు సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నారు.. సూపర్ సిక్స్ చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భయపడటం లేదు.. కానీ, సూపర్ సిక్స్ అమలు చూసి ప్రతిపక్షం భయపడుతోందని వ్యాఖ్యానించారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు..

Read Also: Vikarabad: కాల్వలో మహిళ మృతదేహం.. గుర్తు పట్టకుండ ముఖం కాల్చి..