NTV Telugu Site icon

SLBC Meeting: కాసేపట్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం.. సీఎం కీలక ఆదేశాలు

Slbc

Slbc

SLBC Meeting: రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి సిద్ధమయ్యారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది.. 229, 230వ బ్యాంకర్ల సమావేశాలను ఒకేసారి నిర్వహిస్తున్నారు.. 2024 అక్టోబరు 17 తేదీన జరిగిన 228వ ఎస్ఎల్బీసీ సమావేశం జరిగింది.. ఇక, ఈ సమావేశంలో వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు, పీ4 విధానం అమలు అంశాలపై చర్చించనున్నారు.. ప్రాథమిక రంగానికి రుణాల వితరణ, ఎంఎస్ఎంఈలకు ఆర్ధిక సహకారం, వార్షిక రుణ ప్రణాళికలపై సమీక్షించనున్నారు.. 228 వ బ్యాంకర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, యాక్షన్ టేకెన్ రిపోర్టు పైనా ఎస్ఎల్బీసీ చర్చించనుంది.. టిడ్కో ఇళ్లు, డ్వాక్రా రుణాలు, ముద్రా రుణాలు, స్టాండప్ ఇండియా, పీఎం స్వానిధి లాంటి కేంద్ర పథకాలపైనా సమీక్ష జరగనుంది.. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ నెట్‌వర్క్‌, డిజిటల్ జిల్లాల అంశంపైనా చర్చించనున్నారు.. సీఎం అధ్యక్షతన జరగనున్న సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర శాఖల మంత్రులు హాజరుకానున్నారు..

Read Also: Trump: ట్రంప్ మరో కీలక నిర్ణయం.. స్టీల్‌, అల్యూమినియం దిగుమతులపై భారీగా టారిఫ్