YV Subba Reddy: టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి నివాసంలో సుమారు 10 గంటల పాటు విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు నివాసం నుండి వెనుదిరిగారు. విచారణ సందర్భంగా సిట్ అధికారులు రికార్డ్ చేసిన స్టేట్‌మెంట్‌ను సుబ్బారెడ్డికి చదివి వినిపించినట్లు సమాచారం. విచారణలో భాగంగా, సిట్ అధికారులు సుబ్బారెడ్డి నివాసంలో కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని, వాటిని తిరుపతి సిట్ కార్యాలయానికి తరలించారు. అవసరం అయితే తిరిగి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని సుబ్బారెడ్డికి సిట్ స్పష్టంగా తెలిపింది.
Read Also: Akhanda2 : అఖండ 2.. థియేట్రికల్ రైట్స్.. బాలయ్య కెరీర్ బెస్ట్
ఇక, సిట్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చా. కల్తీ నెయ్యి విషయంలో వాస్తవాలు బయటపడాలనే ఉద్దేశంతోనే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాను… 2024 జూన్‌లో నలుగు నెయ్యి ట్యాంకులు సరఫరా అయ్యాయని చెబుతున్నారు.. అందులో జంతువుల కొవ్వు ఉందా? లేక ఇతర ఆయిల్స్ కలపబడ్డాయా? అన్నది తేల్చమని కోర్టు ఆదేశించింది.. కల్తీ నెయ్యితో నేను అవినీతికి పాల్పడ్డానని ప్రచారం చేయడం దారుణం. అలాంటి పనులు నేను ఎప్పుడూ చేయలేదు అని స్పష్టం చేశారు..
Read Also: IBoMMA Ravi Case: ఐ బొమ్మ రవి కేసులో కీలక పరిణామం.. మరో మూడు సెక్షన్‌లు జోడింపు..
కల్తీ నెయ్యి కాకుండా కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి.. అవినీతి చేయాలంటే అవి చేస్తాను, నెయ్యి ఎందుకు?” అని ప్రశ్నించారు వైవీ సుబ్బారెడ్డి.. మరోవైపు, అప్పన్న నా పీఏ కాదని తెలిపారు.. 2018 నుంచే నాకు పీఏ కాదని వెల్లడించారు.. అతని ఖాతాలో నెయ్యి సరఫరాదారుల నుంచి లావాదేవీలు జరిగి ఉంటే అతనిపై విచారణ జరపాలి. అతనికి సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి అని సూచించారు.. 2014 నుండి నెయ్యి సరఫరాలపై కూడా విచారణ జరపాలని సిట్‌ను కోరా.. భక్తుల విశ్వాసంతో నేను ఎప్పుడూ ఆడుకోలేదు. బాధ్యతగల పదవిలో ఉండి పని చేశానని వెల్లడించారు.. ఇక, ఎప్పుడైనా విచారణకు రావాల్సి వస్తే పూర్తిగా సిట్‌కు సహకరిస్తాను అని ప్రకటించారు వైవీ సుబ్బారెడ్డి..
