Site icon NTV Telugu

AP Liquor Scam Case: లిక్కర్ కేసులో కొత్తగా ఆరుగురు నిందితులు.. చెవిరెడ్డి అరెస్ట్..?

Chevireddy Bhaskar Reddy

Chevireddy Bhaskar Reddy

AP Liquor Scam Case: ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో ఇప్పుడు నిందితుల సంఖ్య 39కి చేరింది.. మద్యం కుంభకోణంలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి పేరును FIRలో చేర్చింది సిట్.. A 38గా చేవిరెడ్డి పేరును పేర్కొంది.. ఈ మేరకు కోర్టులో మెమో వేశారు సిట్ అధికారులు.. చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడు ను ఈ కేసులో A 34గా చేర్చింది.. మరోవైపు, ఇప్పటికే బెంగళూరు విమానాశ్రయం నుంచి కొలంబో వెళ్తుండగా చెవిరెడ్డిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.. చెవిరెడ్డిపై లుకౌట్‌ నోటీసులు ఉండడంతో.. ఏపీ డీజీపీకి సమాచారం పంపించారు ఇమ్మిగ్రేషన్ అధికారులు.. అయితే, ఏపీ పోలీసుల సూచన మేరకు ఎయిర్‌పోర్ట్‌ పోలీస్ స్టేషన్ కు చెవిరెడ్డిని తరలించారు అధికారులు.. ఈ రోజు రాత్రికి చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడును అదుపులోకి తీసుకోనున్న సిట్ బృందం.. రేపు చెవిరెడ్డిని అరెస్ట్‌ చేసినట్టుగా చూపనుంది.

Read Also: Karnataka: కొడుకు అల్లరి భరించలేక ఇనుప కడ్డీతో వాతలు పెట్టిన తల్లి.. పోలీసులు ఏం చేశారంటే..?

ఇక, లిక్కర్ స్కాం కేసులో నిందితుల సంఖ్య పెరిగింది.. కొత్తగా ఆరుగురు నిందితులను చేర్చుతూ కోర్టులో మెమో దాఖలు చేసింది సిట్.. దీంతో, ఇప్పటి వరకు ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో నిందితుల మొత్తం సంఖ్య 39కి చేరింది.. ఏ34 గా వెంకటేశ్ నాయుడు.. ఏ38గా చెవిరెడ్డి పేర్లను ప్రస్తావించారు.. సిట్ కొత్తగా చేర్చిన నిందితుల వివరాలను పరిశీలిస్తే.. ఏ34గా వెంకటేష్ నాయుడు, ఏ35గా బాలాజీ కుమార్, ఏ36గా నవీన్, ఏ37గా హరీష్, ఏ38గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏ39గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్లను చేర్చారు సిట్‌ అధికారులు..

Exit mobile version