APSRTC: ఏపీఎస్ ఆర్టీసీలో డ్రైవర్లు 1,275, కండక్టర్లు 789 మంది కొరత ఉందని తెలిపారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానంగా మాట్లాడిన ఆయన.. ఏపీఎస్‌ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.. EHS ద్వారా సదుపాయాలు అన్నీ అందడం లేదని, రిఫరల్ సరిగా జరగడం లేదని మా దృష్టికి వచ్చిందని వివరించారు.. అయితే, ఉద్యోగుల మెడికల్ ఫెసిలిటీల విషయంలో చర్యలు తీసుకుంటాం అన్నారు.. కానీ, గత ప్రభుత్వంలో బస్టాండులకు నిధులు ఇవ్వకపోవడంతో నిర్వహణ కష్టతరం అయ్యిందని.. రాబోయే రోజుల్లో బస్టాండులు ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి..
Read Also: AUS vs IND: బుమ్రా, రోహిత్ నుంచి కోహ్లీకి షిఫ్ట్ అయిపోతారు.. హర్భజన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇక, ఆన్ కాల్ డ్రైవర్లు సరైన విధానం కాదన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. ఆర్టీసీ డ్రైవర్లుగా అనుభవం లేని వారిని తీసుకురావడం వల్ల ప్రమాదాలు జరిగాయని గుర్తుచేశారు.. మరోవైపు.. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. గుడివాడ బస్టాండును పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.. వర్షం కురిసిందంటే చాలు గుడివాడ బస్టాండ్ నీటమునిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఆ ఇబ్బంది మళ్లీ రాకుండా బస్టాండ్‌ను పునర్నిర్మించాలని శాసన సభలో విజ్ఞప్తి చేశారు..