Site icon NTV Telugu

AP Government Survey: ప్రభుత్వ సేవలపై సర్వే.. షాకింగ్‌ విషయాలు వెలుగులోకి..!

Ap Govt

Ap Govt

AP Government Survey: వివిధ ప్రభుత్వ సేవలపై ఏపీ ప్రభుత్వం ప్రజాభిప్రాయం సేకరిస్తోంది.. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య పౌర సేవలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే నిర్వహించింది.. అయితే, ఈ సర్వేలో కొన్ని షాకింగ్‌ విషయాలతో పాటు.. మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.. ప్రజా పంపిణీ కింద సరఫరా చేయబడిన వస్తువులపై మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ఆపరేటర్లు అదనపు రేట్లు వసూలు చేస్తున్నారని దాదాపు 26.7 శాతం మంది ఫిర్యాదు చేశారు.. ఇక, PDS కింద సరఫరా చేయబడిన నిత్యావసర వస్తువుల నాణ్యత చెడుగా ఉందని కొంత మంది ప్రజలు ఈ సర్వేలో తమ అభిప్రాయంగా తెలిపారు.. ఇక, దీపం-2 పథకం కింద పంపిణీ చేసే సంవత్సరానికి మూడు సిలిండర్లపై డెలివరీ బాయ్‌లు అదనపు రేటు వసూలు చేస్తున్నారానంటున్న 35.2 శాతం మంది లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు..

Read Also: Fugitive Economic Offender: బ్యాంకులను మోసం చేసి.. విదేశాలకు పారిపోయిన బడా వ్యాపారవేత్తలు వీళ్లే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో ప్రయాణం సురక్షితం కాదని భావిస్తున్నామంటూ 30 శాతం మంది ప్రజలు సర్వేలో తెలిపారు.. రాష్ట్రవ్యాప్తంగా APSRTC బస్ స్టేషన్ల నిర్వహణ సరిగా లేదని 40 శాతం కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఫిర్యాదు చేయగా.. బస్ స్టేషన్లలో పరిశుభ్రత, సీటింగ్ మరియు వెయిటింగ్ ప్రాంతాల నిర్వహణపై దాదాపు 44.4 శాతం మంది ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.. బస్ స్టేషన్లలో తాగునీటి సౌకర్యం లేదని 53.7 శాతం మంది అభిప్రాయపడ్డారు.. సరైన టాయిలెట్లు లేవని 43.4 శాతం మంది ఫిర్యాదు చేసినట్టు సర్వే ఫలితాలు చెబుతున్నాయి.. మరోవైపు, గ్రామీణ ప్రాంతాల్లో, 45.28 శాతం మంది పౌరులు తమ ఇంటి గుమ్మం నుండి చెత్తను సేకరించడం లేదని ఫిర్యాదు చేయగా.. వారానికి రెండుసార్లు కూడా చెత్త సేకరణ జరగడం లేదని 46 శాతానికి పైగా ప్రజలు పేర్కొన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో వెలుగు చూసింది..

Exit mobile version