Praveen Prakash: సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ మళ్లీ సర్వీసులోకి వచ్చే ఆలోచనలో ఉన్నారట.. స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్)కు దరఖాస్తు చేసుకున్నారు ప్రవీణ్ ప్రకాష్.. ఇక, ఏపీ సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ గతంలోనే నోటిఫికేషన్ జారీ చేశారు. వీఆర్‌ఎస్ సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.. ఇంకా ఏడేళ్ల సర్వీస్ ఉన్నా.. ఆయన జూన్ 25వ తేదీన వీఆర్‌ఎస్‌కు అర్జీ చేసుకోవడం.. కూటమి ప్రభుత్వం దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి.. అయితే, ఐఏఎస్‌కు తాను చేసిన రాజీనామాను వెనక్కు తీసుకోవాలని సీనియర్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ యోచనగా ఉందట..
Read Also: Jaganmatha Stotram: శ్రావణ మంగళవారం జగన్మాత స్తోత్రాలు వింటే 100 రెట్ల ఫలితాన్ని పొందుతారు
మానసిక ఒత్తిడి వల్ల సర్వీసు నుంచి వైదొలగాలని తొలుత నిర్ణయించుకున్నానంటూ ప్రవీణ్ ప్రకాష్ మొదట వెల్లడించారు.. అయితే, దరఖాస్తు చేసిన 90 రోజులలోగా ఉపసంహరణకు నిబంధనల ప్రకారం అవకాశం ఉంది.. అయితే, సర్వీసులోకి తిరిగి తీసుకునే విచక్షణాధికారం సీఎంది మాత్రనటమేనంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి తన ఆలోచనలను.. వాస్తవ పరిస్థితులను వివరించే ప్రయత్నంలో ప్రవీణ్ ప్రకాష్ ఉన్నట్టుగా తెలుస్తోంది.. ముఖ్యమంత్రి ఆమోదిస్తే, ప్రవీణ్ ప్రకాష్ సర్వీసులోకి కొనసాగే అవకాశం ఉందంటున్నారు.. కాగా, గత ప్రభుత్వంతో అంటకాగినట్టు ఆయనపై విమర్శలు ఉన్నాయి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పని చేయలేనంటూ, ఎన్నికల ముందు నుంచి తన సహచరులతో వ్యాఖ్యానించినట్టుగా కూడా ప్రచారం సాగింది.. అంతే కాదు. నా కోసం మంచి ప్రైవేట్ జాబ్ చూడాలంటూ అప్పట్లో ఓ ఐఏఎస్‌కు వాట్సప్‌లో మెసేజ్ పంపడం చర్చనీయాంశంగా మారింది. ఒకదశలో యూపీ నుంచి ఎంపీగా పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారని, ఉద్యోగానికి రాజీనామా చేస్తారంటూ ప్రచారం కూడా సాగిన విషయం విదితమే..
