AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Local Body Elections 2026: స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా సమావేశం నిర్వహించారు. మొత్తం 20 రాజకీయ పార్టీలకు ఆహ్వానం అందించగా, 19 పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికలను పారదర్శకంగా, చట్ట ప్రకారం నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వివిధ రాజకీయ పార్టీలు తమ సూచనలు, అభిప్రాయాలను కమిషనర్ దృష్టికి తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో కుల ధృవీకరణ పత్రాలు, నో డ్యూ సర్టిఫికెట్ల జారీ విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారు. ఎన్నికల సమయంలో మద్యం నియంత్రణను సమర్థంగా అమలు చేయాలని సూచించారు. అలాగే, దసరా ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల నిర్వహణకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు.. రాజకీయ పార్టీలు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఈ అంశాలపై సంబంధిత జిల్లాల అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల విధానాలను తక్షణమే మార్చడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అయితే, కలెక్టరేట్లో నామినేషన్ల స్వీకరణ అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. సంబంధిత శాఖల నుంచి గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసే అంశంపైనా ఆలోచిస్తామని తెలిపారు.
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
దసరా ఉత్సవాల నేపథ్యంలో ఎలాంటి ఎన్నికల సంబంధిత కార్యక్రమాలు చేపట్టకుండా ఉండే అంశాన్ని కూడా పరిశీలిస్తామని ఎస్ఈసీ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో సున్నిత ప్రాంతాలు, నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. ఎన్నికల భద్రత కోసం పారామిలిటరీ దళాల మోహరింపు అంశాన్ని పోలీసు శాఖకు పంపినట్లు వెల్లడించారు. ఇక, రాజకీయ పార్టీలు చేసిన సూచనలను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!