AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అమల్లోకి వచ్చిన కోడ్..

  • ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
  • రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి షెడ్యూల్‌..
  • ఫిబ్రవరి 3న నోటిఫికేషన్.. 27న పోలింగ్.. మార్చి 3న ఓట్ల లెక్కింపు..
Mlc Elections

Mlc Elections

AP MLC Elections: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల సంఘం.. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి.. ఏపీలో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి షెడ్యూల్‌ వచ్చేసింది.. ఫిబ్రవరి 3న వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుండగా.. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.. ఇక, ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో తక్షణమే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది..

Read Also: Vasi Zakariya: పోలీసుల అదుపులో ఖలీఫా సంస్థ జాతీయ అధ్యక్షుడు జకర్య

అయితే, ఏపీలో రెండు గ్రాడ్యుయేట్, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చే నెల 3న నోటిఫికేషన్ విడుదల చేస్తారు.. 27న పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.. కాగా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టుభద్రుతల ఎమ్మెల్సీ నియోజకవర్గంతో పాటు కృష్ణ – గుంటూరు జిల్లాలకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి.. శ్రీకాకుళం – విజయనగరం – విశాఖపట్నం ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.. అయితే, మార్చి 29వ తేదీతో ప్రస్తుత ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది.. దీంతో.. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది ఎన్నికల కమిషన్‌.. ఇక, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థిగా డీవీ రాఘవులు పేరు ఖరారు చేశారు.. కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం పేరు ప్రకటించారు..