Sajjala Ramakrishna Reddy: వైఎస్సార్ సంక్షేమ వారసత్వాన్ని జగన్ కొనసాగిస్తున్నారు.. మళ్లీ వైసీపీ విజయం ఖాయం..
- సంక్షేమ పాలనకు వైఎస్సార్ నాంది పలికారు..
- వైఎస్సార్ ఆశయాలను జగన్ ముందుకు తీసుకెళ్తున్నారు..
- వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: అమరావతిలో వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపాయని అన్నారు. ఆరోగ్యశ్రీ వంటి పథకాలు పేదల ప్రాణాలను కాపాడడమే కాకుండా, దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. వైఎస్సార్ కారణంగానే అనేక మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఇంజనీర్లు, వైద్యులుగా ఎదిగారని ఆయన తెలిపారు.
ఇక, వైఎస్సార్ భౌతికంగా లేకపోయినా, ఆయన వారసత్వాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్థంగా కొనసాగిస్తున్నారని సజ్జల అన్నారు. ప్రజల కోసం వైఎస్సార్ ఒక అడుగు వేస్తే, జగన్ రెండు అడుగులు ముందుకు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ జగన్ తన పట్టుదల, దార్శనికతతో ప్రజల్లో విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారని చెప్పారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన, అధికార కూటమి మోసపూరిత హామీలతో ప్రజలను నిరాశపరిచిందని ఆరోపించారు. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, కూటమి నాయకులు ప్రజల ముందుకు వెళ్లేందుకు కూడా వెనుకాడుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని, గతం కంటే మెరుగైన పాలనను అందిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
- CRDA: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ..
- Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
తాజావార్తలు
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
-
KPHB: హైదరాబాద్‌లో చీటీల పేరిట రూ.16 కోట్ల కుచ్చుటోపీ
-
IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
-
Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?