Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy: జగన్ ను అరెస్ట్ చేస్తారా..? సజ్జల సమాధానం ఇదే..

Sajjala

Sajjala

Sajjala Ramakrishna Reddy: ఏపీలో సంచలనం సృష్టిస్తోన్న లిక్కర్‌ స్కామ్‌ కేసులో అంతిమ లబ్ధిదారుడు వైఎస్‌ జగనేనా? జగన్‌ను అరెస్ట్‌ చేస్తారా? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. అయితే, వైఎస్‌ జగన్‌ను ఎదుర్కొనే సత్తా చంద్రబాబుకు లేదన్న ఆయన.. గత ఎన్నికల్లో.. పవన్‌ కల్యాణ్‌, బీజేపీ సహకారంతోనే జగన్‌పై విజయం సాధించారు తప్ప.. అంతకంటే ఏమీ లేదన్నారు.. అయితే, జగన్‌ను జైలుకు పంపితే.. చంద్రబాబు కడుపుమంట ఏమైనా తగ్గుతుందేమో అని వ్యాఖ్యానించారు సజ్జల..

Read Also: Realme 15 5G Series: మిడ్ రేంజ్ బడ్జెట్ లో.. ప్రీమియం ఫీచర్స్ తో.. రియల్‌మి 15 ప్రో 5G, రియల్‌మి 15 5G రిలీజ్..

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి సీట్ల పరంగా దెబ్బతగిలింది అనుకున్నా.. ఓట్ల పరంగా ఏమీ జరగలేదన్నారు సజ్జల.. అయితే, ఈ ఎన్నికల తర్వాత ఏడాది కాలంలోనే పార్టీ నేతలు, కార్యకర్తలు గట్టిగా నిలబడగలిగారంటే.. ప్రజలలో వ్యతిరేకత వచ్చింది అంటే.. కూటమి నేతలు చెప్పింది అబద్ధమని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు.. చంద్రబాబు భయపెట్టడం.. జైళ్లలో పెట్టినంత మాత్రాన వైసీపీ ఎక్కడా వెనక్కి తగ్గదంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

Exit mobile version