Minister Satya Kumar Yadav: వైద్య, ఆరోగ్య శాఖకు రూ.19,264 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. గిరిజన ప్రాంతాల్లో ఒక్కొక్కటీ రూ. 50 కోట్ల వ్యయంతో 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల్ని నిర్మిస్తున్నామని సత్యకుమార్ యాదవ్ శాసనసభకు వివరించారు. రూ. 19,264 కోట్లు బడ్జెట్ గ్రాంట్ ను మంజూరు చేసినందుకు శాసనసభకు ధన్యవాదాలు తెలియచేస్తున్నానని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం ఆఖరు సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కన్నా 30 శాతం మేర ఇది అధికమనీ, ఆరోగ్య, సంపన్న, ఆనందమయ ఆంధ్రప్రదేశ్ రూపకల్పనకుగాను ఆరోగ్యశాఖకు పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయింపులు చేశారన్నారు మంత్రి… 9 నెలల్లో అనేక సంస్కరణలు వైద్య, ఆరోగ్యశాఖలో తీసుకొచ్చామనీ మంత్రి స్పష్టం చేశారు. అలాగే ఇంటర్ వరకూ 69 మంది లక్షల మంది విద్యార్ధులకు హెల్త్ రికార్డుల్ని రూపొందించామని మంత్రి వివరించారు. కోటీ 40 లక్షల మందికి వివిధ రోగాలకు సంబంధించిన స్క్రీనింగ్ టెస్టుల్ని నిర్వహించామన్నారు.. 108 సేవల కోసం 190 అంబులెన్స్‌లను , 53 మహాప్రస్థానం అంబులెన్సులను కొనుగోలు చేస్తున్నట్టు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు..
Read Also: Maharashtra: ఔరంగజేబు సమాధిని తొలగించాలనే డిమాండ్.. ముస్లింలు ఏమన్నారంటే?
